జనతా కర్ఫ్యూ పాటిద్దాం..కరోనా వ్యాప్తిని నివారిద్దాం- అనంత ఎస్పీ

75

అనంతపురం జిల్లా ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆదివారం చేపట్టబోయే జనతా కర్ఫ్యూను జిల్లా ప్రజలందరూ స్వచ్ఛంధంగా పాటించి కరోనా వ్యాప్తిని నివారిచాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పిలుపునిచ్చారు.

ఈనెల 22 న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందేనన్నారు.

ఇటలీ దేశంలో ఈ ఫిబ్రవరి 25 తేదీన 310 మంది కరోనా బాధితులు ఉండగా… సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరియు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు,

సలహాలు పెడచెవిన పెట్టడంతో బాధితుల సంఖ్య మార్చి 20 నాటికి 50 వేలుకు చేరుకుందన్నారు.

అలాగే … కరోనా వైరస్ ప్రారంభమైన చైనాను అధిగమిస్తూ 20 రోజుల వ్యవధిలో సుమారు 4 వేలకు పైగానే ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు

. ప్రజలు దీన్ని గుర్తించి మన ప్రభుత్వాలు సూచిస్తున్న జాగ్రత్తలు, సలహాలు పాటిస్తూ జనతా కర్ఫ్యూను జయప్రదం చేయాలని కోరారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృభించిన నేపథ్యంలో మనం కూడా సంఘటితంగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యక్తులు …తద్వారా కుటుంబాలు… తద్వారా సమాజమే కరోనా మహమ్మారి బారిన పడే పెను ప్రమాదముందన్నారు.

ఈపరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ మేల్కోవాలి. ఈ ఉపద్రవం విస్తరించకుండా చైతన్యవంతులై ఉండాలన్నారు.

జనతా కర్ఫ్యూ స్వచ్ఛంధంగా పాటించాలన్నారు. ఇళ్లలోనే ఉంటూ మద్ధతు తెలపాలని..దీనివల్ల జనతా కర్ఫ్యూతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసిన వారమవుతామన్నారు.

పోలీసు సిబ్బంది జనతా కర్ఫ్యూ సమయంలో పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ – 100 లేదా జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్లకు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here