జగన్ సిఎం కావడం పగటి కల- మంత్రి పరిటాల సునీత

14

ప్రతిపక్ష నేత జగన్ సిఎం కావడం పగటి కలేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం గుంటూరు లోని రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.జగన్ బీజేపీ తో కుమ్మక్కై చంద్ర బాబు ని తిట్టడానికే పాదయాత్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు.తమ నాయకుడు చంద్ర బాబు కూడా పాదయాత్ర చేశారని, అప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని, ఇప్పుడు అవన్నీ అమలు చేస్తున్నారని తెలిపారు.కానీ జగన్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పకుండా మంత్రులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడన్నారు.జగన్, కన్నా లక్ష్మీనారాయణలు రాయలసీమ కు అన్యాయం జరుగుతోందని అంటున్నారని, వారు రాయలసీమ కు వస్తే ఎంత అభివృద్ధి జరిగిందో చూపిస్తామని సవాల్ విసిరారు.అన్ని భోజన సదుపాయాలు కల్పించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చూపిస్తామన్నారు.ఎన్టీఆర్ భూమి పూజ చేసిన హంద్రీనీవా ప్రాజెక్టు ను కాంగ్రెస్ హయాంలో పదేళ్లు పక్కన పెట్టారని, నిధులు మింగేశారని దుయ్యబట్టారు.చంద్ర బాబు ఆ ప్రాజెక్టు ని పూర్తి చేసి అనంతపురానికి నీళ్లు ఇస్తున్నారని తెలిపారు.సీమలో ఇప్పుడు ఎకరాకు 40 – 45 బస్తాల ధాన్యం పండిస్తున్నామని తెలిపారు.కడపలో చీనీ చెట్లు ఎండిపోకుండా నీళ్లు ఇచ్చామని చెప్పారు.ఒకప్పుడు కోస్తా కే పరిమితం అయిన కూరగాయల ను కూడా పండిస్తున్నామని, ఇదంతా చంద్ర బాబు కృషి అని వివరించారు.పది సంవత్సరాల కాంగ్రెస్ , వైయస్ పాలనలో సీమలో ఎంతోమంది పసుపు కుంకుమ లు తుడిచారని ధ్వజమెత్తారు.అనంతపురం లోనే 50 మంది ని పొట్టనపెట్టుకున్నారని ఫైర్ అయ్యారు.కాని చంద్ర బాబు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 6, 883 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చి పెద్దన్న గా నిలిచారని కొనియాడారు.కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఒక్క దీపం కనెక్షన్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ప్రతి డ్వాక్రా మహిళ ఇంటికి దీపం కనెక్షన్ ఇచ్చామని తెలిపారు.పసుపు కుంకుమ కింద ఇప్పటి వరకు ఒక్కొక్కరి ఖాతాల్లో 8 వేల రూపాయలు వేశామని, దసరా పండుగ కానుకగా మిగిలిన 2 వేల రూపాయలు కూడా జమ చేయనున్నామని వెల్లడించారు.కాంగ్రెస్ హయాంలో పదేళ్ల లో రూ. 2314 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు వడ్డీ చెల్లిస్తే, లోటు బడ్జెట్ లో వున్నా కేవలం 4 సంవత్సరాల్లో టిడిపి ప్రభుత్వం రూ. 2514 కోట్లు వడ్డీ చెల్లించిందని తెలిపారు.

మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత చంద్ర బాబు కే దక్కుతుందని అన్నారు. ఇప్పటి వరకు రూ. 51745 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చామని. రూ. 3 వేల కోట్ల తో స్త్రీ నిధి ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఇవి కాక అన్న అమృత హస్తం, బాల సంజీవని, బాలామృతం పథకాల తో గర్భిణులకు, శిశువు లకు పౌష్టికాహారం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here