జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సినీనటుడు కృష్ణుడు

41

టాలీవుడ్ నటుడు కృష్ణుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్సాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ఆకర్షితుడునై పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.

సోమవారం కత్తిపూడి వైయస్‌ జగన్‌ సమక్షంలో కృష్ణుడు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్‌ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ…. వైయస్‌ జగన్‌ పాదయాత‍్రను చూసే పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఏపీలో వైయస్సార్‌సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 230వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 230వ రోజు పాదయాత్రను ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి క్రాస్‌ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం మీదుగా శంఖవరం వరకు కొనసాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here