జగన్ వ్యాఖ్యలపై నారా లోకేష్ సెటైర్లు

110

వైసీపీ అధినేత జగన్‌కు ఎంప్లాయిమెంట్‌పై సరైన అవగాహన లేదని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విద్యార్థులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ప్రైవేటు పరిశ్రమలో 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. కానీ జగన్ మాత్రం 75 శాతమే కల్పిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అంటే జగన్‌కు ఎంప్లాయిమెంట్‌పై అవగాహన లేదని గుర్తుచేశారు. యువత రాజకీయాల్లోకి కూడా రావాలని కోరారు. అప్పుడే మార్పు వస్తుందని పిలుపునిచ్చారు. ఏ రంగాల్లో అయినా యువత రాణించే విధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో యువతకు పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. 2019 ఎన్నికలు చాలా కీలకమని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. భారతదేశంలో ఏపీని అగ్రస్థానంలో ఉంచాలనేదే చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. ఐదేళ్లలోనే ఇంత అభివృద్ధి జరిగితే.. మరో ఐదేళ్లు మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here