జగన్ పెద్ద సైకో;చంద్రబాబు

74

జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఆ కుట్రను చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. తెలంగాణలో డిక్టేటర్ మాదిరి తయారైన కేసీఆర్.. ఆంధ్రాను జగన్ ద్వారా డిక్టేట్ చేయడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు నేతలతో ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని జగన్ కేసీఆర్‌కు అమ్మేస్తున్నాడనే భావన ప్రజల్లో బలపడుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ చెడగొడుతూ ప్రతి ఒక్కరూ ఛీకొట్టే పరిస్థితికి కేసీఆర్ తెస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్‌ది సైకో మనస్తత్వం అని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు కూడా తండ్రి చావుని రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అతిపెద్ద అఫిడవిట్‌ను జగన్ దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా, ఇన్ని నేరాలతో ఇంకెవ్వరూ అఫిడవిట్‌ దాఖలు చేయరని ఎద్దేవాచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here