జగన్ పాదయాత్రకు కాపుల నిరసన సెగ

48

తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు మారోసారి కాపుల నిరసన సెగ తగిలింది. శనివారం జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జగన్ పాదయాత్ర చేపట్టారు. వెంటనే కాపు యువకులు నల్లజెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ‘రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాడుదాం…మనకు కావాల్సింది రాజకీయ పార్టీలు కాదు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here