జగన్ కు మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్

24

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన..” నీ కుటుంబ చరిత్ర ఏంటో.. నా కుటుంబ చరిత్ర ఏంటో తేల్చుకుందాం” అని జగన్‌‌కు బహిరంగ సవాల్ విసిరారు. మీ తాత రాజారెడ్డి చరిత్ర గుట్టువిప్పుతా అంటూ మంత్రి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. బైరటీస్ గనులకోసం నర్సయ్యను రాజారెడ్డి హత్య చేయించారని సంచలన విషయం బయటపెట్టారు.

సీబీఐ, ఈడీ కేసులున్న నీవు నన్నే విమర్శిస్తావా?. నాపై జగన్, ఎంపీ విజసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వీడియో విడుదల చేశారు” అంటూ ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమను విమర్శించే శక్తిని జగన్ ఎప్పుడో కోల్పోయారని, అధికారులను ప్రలోభపెట్టే జగన్ ఐఏఎస్‌ల కొంప ముంచారని దుయ్యబట్టారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here