జగన్‌ రక్తం రుచి మరిగిన తోడేలులాంటివాడు – సాధినేని యామిని

748

జగన్‌ ఒక జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తున్నారని, మనిషి రక్తం రుచి మరిగిన తోడేలు లాంటివాడు జగన్‌ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ పేర్కొన్నారు. ఆదివారం ప్రజా వేదిక వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ… సాక్షి పత్రికలో కొన్ని కామెంట్స్‌ చేస్తూ చంద్రబాబునాయుడుగారిని నర హంతకుడిలా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇది చదివిన ప్రజలు సాక్షి పత్రికను అసహ్యించుకుంటున్నారు. జగన్‌ను ఛీకొట్టే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. తండ్రి మరణం దగ్గర నుంచి చిన్నాన్న హత్య వరకు కూడా శవ రాజకీయాలు చేశారు.సామాన్య మానవులు, రైతులు మరణిస్తే అది సహజ మరణమైనా వ్యక్తి మరణాన్ని కూడా తన రాజకీయం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఆయన పరిస్థితి చాలా జుగుప్సాకరంగా ఉంది. అవినీతి రహిత పాలన చేస్తానంటున్న జగన్‌ వాన్‌పిక్‌లో 28 వేల ఎకరాలు, లేపాక్షిలో 8,888ఎకరాలు 113 సెజ్‌ల పేరుతో 5 లక్షల ఎకరాల్ని అప్పణంగా వారి బినామీల పేరిట మార్పించుకున్నారు. ఈ రోజుకి కూడా ప్రతి శుక్రవారం కోర్టు గడప ఎక్కాల్సి వస్తోంది. మనీ లాండరింగ్‌ కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి అవినీతి రహిత పాలన అందిస్తాననటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఆయన మాటలు ప్రజలు నమ్ముతారనే భ్రమని చూసి నవ్వాలో? ఏడ్వాలో అర్థం కావడంలేదు. అవ్వకి చెప్పండి, అన్నకి చెప్పండి, చెల్లికి చెప్పండి, తమ్ముడికి చెప్పండంటున్నాడు. 7 సంవత్సరాల నుంచి మనీ లాండరింగ్‌ కేసులో ప్రతి శుక్రవారం మీరు ఎందుకు కోర్టు మెట్లెక్కుతున్నారో ప్రతి అక్కకు, చెల్లికి చెప్పండి. పరిటాల రవితో సహా 300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపి ఆడ పడచుల పుస్తెలు తెంపిన నేర చరిత్ర జగన్‌ది. నాకు ఓటెయ్యండి, గెలిపించండని ప్రజల వద్దకు వెళ్లి అడిగే హక్కు జగన్‌కు లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు బెదరి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. పారిశ్రామికవేత్తల్ని టార్చర్‌ పెట్టి కంపెనీలను మూసుకుని వెళ్లిపోయేలా వ్యవహరించారు. చంద్రబాబునాయుడు ఎన్నో కంపెనీలను తీసుకొచ్చారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో ఈ కంపెనీలకు రావాల్సిన రాయితీలను తీసుకురావచ్చుకదా? అది చేతకాదు కానీ ప్రజల విద్వేషాల గురించి మాట్లాడి పబ్బం గడుపుకోవడం అలవాటు. అవినీతి సామ్రాజ్యానికి పేటెంటే జగన్‌. కుల రాజకీయాలు చేస్తారు. 13 జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు మీ కంపెనీకి చెందినవాళ్లే వున్నారు. అన్నీ వాళ్ల సామాజిక వర్గాలవారికే టికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన నాయకులకు రాష్ట్రం అప్పగిస్తే రాష్ట్రం మరో బీహార్‌ అవుతుంది. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అవుతున్నారమ్మా అని జగన్‌ అడుగుతున్నారు. లోటస్‌పాండ్‌కెళ్లి నిద్రపోతే ఎలా అవుతారు? తెలుగుదేశం ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్టేట్‌ అయింది. విద్యోన్నతి కల్పిస్తున్నారు. అన్ని కులాలకు, మతాలకు అతీతంగా 15 లక్షలు, 10 ల్షలు ఇచ్చి విదేశాలకు చదువుకోసం పంపిస్తున్నారు. విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు. ఏపీకి చెందిన శాసనసభకు పోటీచేసే అభ్యర్థుల జాబితా లోటస్‌పాండ్‌ నుంచి తయారు చేసి, కేసీఆర్‌ అనుమతితో ఇడుపులపాయలో విడుదల చేశారు. మూల్యాంకన టీఆర్‌ఎస్‌ పార్టీది. ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో అటెస్టు చేయించుకున్నారు. ఇడుపులపాయ నుంచి జాబితా రిలీజ్‌ చేశారు. చంద్రబాబుకు అమరావతి రాజధాని అయితే జగన్‌కు లోటస్‌పాండ్‌, ఇడుపులపాయి రాజధానిగా ఉంటోంది. మూడు వేలు పెంచుకుంటూపోతానని జగన్‌ చెబుతున్నారు ఎన్నోళ్లు పెంచుతారు? ప్రత్యేక హోదా, విభజన హామీలు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి వున్నాయి. ఒక్కసారైనా కేంద్రాన్ని అడిగారా? కేంద్రం నుంచి ఎంత రావాలో ఈ ప్రణాళిక ఉందా? పనికిరాని గులకరాళ్లను కాపీ కొట్టామనటంలో అర్థం లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని చోట్ల తిరిగినా జగన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. విశ్వసనీయతకు వంచనకు జరగబోయే ఎన్నికలివి. చంద్రబాబునాయుడు విశ్వసనీయత, అభివృద్ధి, ముందుచూపు అయితే. జగనంటే అవినీతికి రారాజు, కుమ్మక్కు రాజకీయాలు చేసేది జగన్‌. శవ రాజకీయాలు చేసేదెవరంటే జగన్‌. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను డైవర్ట్‌ చేయాలని చూస్తే మీ కుతంత్రాలు సాగవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here