జగన్‌ పాదయాత్రతో భూముల ధర తగ్గిపోయింది – మంత్రి ప్రత్తిపాటి 

24

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేయడం వల్ల రాజధాని రైతుల భూముల విలువ గజానికి 2-3వేల రూపాయలకు తగ్గిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 21న సీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించి గోడ పత్రికలను మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని భ్రమరావతిగా పోల్చిన జగన్‌కు అక్కడ పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృద్ధి కనపడుతుందని అన్నారు. జగన్ అమరావతికి అనుకూలమా? వ్యతిరేకమా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే జిల్లాను దాటేశారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here