జగన్‌ ఆరోపణలతో పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం!

86

జగన్‌ ఆరోపణలతో ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 మంది కాదు.. కమ్మ కులం ఇద్దరే, బీసీలు 9 మంది, రెడ్డి 7, దళితులు ఏడుగురు..డీఎస్పీ పదోన్నతులపై ప్రభుత్వ ప్రకటన.. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.ప్రమోషన్లలో బీసీలకు పెద్ద పీట వేసినట్టు పేర్కొన్నాయి. సంబంధిత సమాచారాన్ని సోమవారం విడుదల చేశాయి. ఆ ప్రకారం 2014 ఫిబ్రవరి రెండో తేదీ వరకూ ప్రమోషన్‌ ప్యానల్‌లో ఉన్న 21 మందికి ఇప్పటికే డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. వీరిలో దళితులు అత్యధికంగా ఏడుగురు, బీసీలు ఐదుగురు, ఎస్టీలు నలుగురు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురు, ఇతర ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఉన్నారు.వీరు కాక 2018 సంవత్సరం వరకూ ప్యానల్‌ను ఆమోదిస్తే రెగ్యులర్‌ డీఎస్పీలుగా ప్రమోషన్‌ పొందబోయే వారు మరో 35 మంది ఉన్నారు.వీరు ప్రస్తుతం సూపర్‌ న్యూమరీ పోస్టుల్లో డీఎస్పీలుగా ఉన్నారు.వీరి విషయంలోనే జగన్‌ ఆరోపణలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.ఇందులో బీసీలు తొమ్మిది మంది, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు, దళితులు ఏడుగురు, బలిజ, కాపు సామాజిక వర్గీయులు నలుగురు, ముస్లింలు ఇద్దరు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరు ప్రమోషన్లు అందుకోబోతున్నారు.శాఖాపరంగా కసరత్తు చేశాకే ప్రమోషన్లు జరుగుతాయని, ప్రభుత్వం తలదూర్చదని ఆ వర్గాలు తెలిపాయి.

పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం..

డీఎస్పీలకు ప్రమోషన్ల విషయంలో జగన్‌ వ్యాఖ్యలు పోలీస్‌ అధికారుల మనోధైర్యం దెబ్బతినేలా ఉన్నాయని పోలీస్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here