చేనేత కార్మికులకు అండగా ఉంటా..సీఎం

42

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటన కొనసాగింది. ధర్మవరంలో రైల్వే వంతెనను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఉపాధిలేక ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు రూ.110 కోట్లు ఒకే దఫాలో ఒకేరోజు విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులను పూర్తిగా ఆదుకొనే బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రీయ స్వస్త్‌ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. చేనేత కార్మికుల కోసం చేనేత భవన్లు, నేత బజార్లు ఏర్పాటుచేసి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు రూ.24వేల కోట్లు, డ్వాక్రా సంఘాలకు రూ.10వేల కోట్లు రుణవిముక్తి కల్పించామని వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఒక్క అనంతపురంలోనే చేనేతలకు రూ.36కోట్లు రుణవిముక్తి కల్పించామన్నారు. అనంతపురం జిల్లాలోని వేరుశెనగ ప్రపంచ మార్కెట్‌కు వెళ్లేలా చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పరిశ్రమలు అనంతపురానికే వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి చీఫ్‌విప్‌ కాలువ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here