`చుట్టాలబ్బాయి‘కి మరో 100 థియేటర్లు పెంచుతున్నాం- వెంకట్ తలారి

105

venkat talariఆది, నమిత ప్రమోద్ జంటగా దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌… ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మాస్ ప్రేక్షకులన్ని బాగా అలరిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన వెంకట్ తలారి మాట్లాడుతూ ‘నిర్మాతగా తొలి చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా విడుదలైన రోజు నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదల రోజున 350 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో వంద థియేటర్స్ ను పెంచుతున్నాం. మొదటి మూడు రోజుల్లో ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మరో రెండు రోజుల్లో మేం పెట్టిన డబ్బు వచ్చేస్తుంది. సాయికుమార్ గారు, ఆది కలిసి నటించడం ఒక ప్లస్ అయితే, థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్ అయ్యింది. కామెడి బాగా పండింది’ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సినిమా బావుందని అంటున్నారు. అలాగే నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారు సినిమా బావుందని అప్రిసియేట్ చేశారు. అలాగే గ్రంధి మల్లిఖార్జునరావు గారు సినిమా చూశారు. మరి కొంత మంది ప్రముఖులు కూడా సినిమా చూడాలని అంటున్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి, నెల్లూరు, కడప, వైజాగ్, విజయవాడ, గుంటూరు ఇలా నాలుగైదు రోజుల పాటు యూనిట్ సభ్యులు ప్రేక్షకులను కలిసే ప్లాన్ చేస్తున్నాం. మా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ లో వీరభద్రమ్ గారి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మరికొన్ని చిత్రాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తా’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here