చివరి షెడ్యూల్లో నాగచైతన్య ‘సవ్యసాచి’

39
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సవ్యసాచి”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు.
ఈ చిత్రం టాకీ పార్ట్ ఆగస్ట్ 8తో పూర్తికానుంది. ఆగస్ట్ 15న ఫారిన్ లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 15 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోపాటు సీజీ వర్క్ కూడా పూర్తికానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.
తారాగణం:
నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here