చిరంజీవి కేంద్రమంత్రి ఎలా అయ్యారో పవన్ చెప్పాలి: బుద్దా వెంకన్న

38

తన అన్నయ్య చిరంజీవి కేంద్రమంత్రి ఎలా అయ్యారో తమ్ముడు పవన్ కల్యాణ్ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్‌పై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివే ముందు పవన్ ఆలోచించుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంఘవిద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అడిగితే సామాన్యులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను రుజువు చేయగలరా..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here