• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

చదువు జ్ఞానాన్ని..క్రీడలు ఆరోగ్యాన్ని అందిస్తాయి -మంత్రి పేర్ని నాని

admin by admin
September 11, 2021
in politics
0 0
0
చదువు జ్ఞానాన్ని..క్రీడలు ఆరోగ్యాన్ని అందిస్తాయి -మంత్రి పేర్ని నాని
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మనిషికి చదువుతో పాటు ఆటలు సైతం చాలా ముఖ్యం అని చదువు జ్ఞానాన్ని పెంచితే, క్రీడలు ఆరోగ్యాన్ని అందిస్తాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.

                           దివంగత మంత్రి పేర్ని కృష్ణమూర్తి స్మారక  7 వ  జూనియర్  ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ 2021 క్రీడా పోటీలు మచిలీపట్నం మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  క్రీడా ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం ఆర్బాటంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రి పేర్ని నాని, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ ఛైర్మెన్ గూడవల్లి నాగరాజు, యువనేత పేర్ని కిట్టు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలో క్రీడలు దైనందిక జీవితంలో భాగం కావాలని సూచించారు. విద్యా ర్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని తప్పక పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడ ల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక ధృఢత్వంతో పాటు, మాన సికోల్లాసం వృద్ధి చెందుతుందన్నారు. క్రీడలు మంచి సమాజానికి నాంది అని అలాగే అలాగే క్రమశిక్షణకు మారుపేరు క్రీడలని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఉత్తేజంతో పాటు చక్కని ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ దిశగా తల్లితండ్రులు విద్యార్ధులను ప్రోత్సహించాలని సూచించారు. తమ పిల్లలకు చిన్ననాటి నుండే క్రీడలపై ఆసక్తి ఉండేవిధంగా తల్లితండ్రులు చొరవ చూపాలన్నారు. వివిధ జిల్లాల నుంచి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, భోజనం, వసతి ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక క్రీడాకారిణి తమకు కేటాయించిన గదులలో ఫ్యాన్ , లైట్లు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై స్పందించిన ఆయన తక్షణమే ఆ బాలికలకు ఆ సౌకర్యం కలుగచేయాలని సాయంత్రం వేళకు ఆయా ఏర్పాట్లు నిర్వాహకులు చేయకపోతే, మీ మొబైల్ ఫోన్లో  గూగుల్  లో  పేర్ని నాని ఫోన్ నెంబర్ అడిగి ఆ నెంబర్  ద్వారా తనకు తెలియచేయాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడకుండా పేరు ప్రఖ్యాతులు లభించవని, ఒక స్థానానికి చేరుకోవాలంటే జీవితాంతం శ్రమించాల్సిందేనని అన్నారు.   ఒకవేళ కష్ట పడినా నష్టపోయామంటే ఆ తప్పు మనది కాదన్నారు.  క్రీడల వలన మంచి భవిష్యత్ ఉంటుందని తల్లితండ్రులు నమ్మాలని, ఆదిశగా చిన్ననాటి నుండే క్రీడాకారులను తయారు చేయాలని చెప్పారు.  క్రీడలను ఒక కెరీర్ గా ఎంచుకోవాలని బైరెడ్డి సూచించారు. కృష్ణాజిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంతో ప్రతిభ ఉండి  కేవలం మట్టిలో మాణిక్యాలు మాదిరిగా  వెలుగొందే వర్ధమాన క్రీడాకారులను వెలికి తీసేందుకు వైస్సార్ సీపీ యువజన నాయకులు  పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ) ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సాహించి  తన వంతు సహాయ సహకారాలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్ ల నియామకానికి అవసరమైన చర్యలను చేపడుతామన్నారు. క్రీడారంగంలో నూతన పాలసీని తీసుకువచ్చి.. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలనేది.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. ఆ దిశగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని స్పోర్ట్స్ అతరిటీల్లో మౌలిక వసతులు, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందివ్వడం జరుగుతోందన్నారు. క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే.. క్రీడల గురించి బాగా తెలిసిన వారే ఖచ్చితమైన న్యాయం చేయగలరన్నారు. క్రీడలపై ప్రత్యేక అభిమానం వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థను మరింత పటిష్టం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రభావం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు.. క్రీడా రంగంపై అధికంగా పడిందన్నారు. దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో కూడా.. క్రీడారంగం ఆదరణకు నోచుకోలేక పోయిందని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు
తర్వాత కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ ఛైర్మెన్ గూడవల్లి నాగరాజు  ప్రసంగిస్తూ, క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాళ్లపాలెం గ్రామ సర్పంచ్ ఎం. అశ్విని , రాష్ట్ర ఎస్సి కమీషన్ ఛైర్మెన్ మారుమూడి విక్టర్ ప్రసాద్,  మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు స్థానిక నేతలు  తదితరులు పాల్గొన్నారు.

Previous Post

సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు: అల్లు అరవింద్

Next Post

రాజధానిలో మళ్లీ రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

Next Post
రాజధానిలో మళ్లీ రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

రాజధానిలో మళ్లీ రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1 “నెల్సన్” ప్రారంభం
  • యమ్.యల్.ఏ కంచర్ల భూపాల్ రెడ్డి చేతులమీదుగా విడుదలైన “రుద్రవీణ” ప్రి లుక్ పోస్టర్
  • బిందు గేమ్… నటరాజ్ మాస్టర్ కి అర్థమైందా..?!!
  • ఇంటర్వ్య ; ‘సర్కారు వారి పాట’ ని మళ్ళీ మళ్ళీ చూస్తారు: మహేష్ బాబు
  • డైలాగ్ కింగ్ సాయికుమార్  చేతులమీదుగా విడుదలైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘ధగడ్ సాంబ’ ట్రైలర్

Recent Comments

  1. A WordPress Commenter on Hello world!

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021

Categories

  • movies
  • politics
  • reviews
  • Uncategorized
  • Home
  • Movies
  • Politics
  • Reviews

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In