చంద్ర‌బాబుపై మోహ‌న్‌బాబు ఫైర్

29

పౌరుడిగా ఏ పార్టీలో అయినా చేరే స్వేచ్ఛ తనకుందని సినీ న‌టుడు మోహన్ బాబు అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇన్నేళ్లకు మరో పార్టీలో చేరినట్టు వెల్లడించారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న అనంత‌రం మోహ‌న్ బాబు మీడియాతో మాట్లాడారు. జగన్‌ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే ఈ పార్టీలో చేరానన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై మోహన్‌బాబు స్పందించారు. నాలుగేళ్లుగా త‌మకు రావాల్సిన ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ పై చంద్రబాబుకు ఉత్త‌రాలు రాసినా, ఫోన్ చేసినా స్పందించ‌లేద‌న్నారు. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. ప్రారంభంలో ఆయ‌న‌ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ప్ర‌శ్నించారు. 1975 నుంచి నా సంపాదన వివరాలు ఇస్తా… చంద్రబాబు ఇవ్వగలడా అని మోహన్‌బాబు సవాల్‌ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here