చంద్రబాబు రాజధాని పర్యటనపై బొత్స ఫైర్

101

నాలుగేళ్లలకాలంలో రాజధాని కోసం చంద్రబాబు ఏం ఊడబొడిచారు.గతంలో రాజధాని రైతుల కోసం ఇచ్చిన జీవోలను తూచా తప్పకుండా అమలు చేస్తాం.
ఆరు నెలల కాలంలో మ్యానిఫెస్టో చెప్పిన అంశాలను అత్యథిక శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిదే.

సచివాలయంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పాయింట్స్

క్రొత్త ప్రభుత్వానికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. కాస్త టైం కావాలి. ప్రతిపక్షాలు మాత్రం మొదటి రోజు నుండే ప్రభుత్వం పై దాడి చేస్తున్నాయి. రైతు భరోసా…ఇసుక..ఇంగ్లీష్ మాధ్యమం లాంటి అనేక విషయాల్లో మాపై విమర్శలు చేయడం తరువాత నాలుక కరుచుకోవడం చంద్రబాబు కి అలవాటు గా మారింది. మాతృభాష కు మెమెప్పుడూ వ్యతిరేకం కాదు.కేవలం ఆంగ్లభాష అవసరాన్ని మాత్రం మేము గుర్తిస్తున్నాం. దీనిపై కూడా తన అనుకూల పత్రికల్లో మాపై విమర్శలు చేయిస్తున్నారు. సామాన్యుడు ఇంగ్లీష్ లో చదువుకోవడం చంద్రబాబు కి నచ్చడం లేదు. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ రాజధాని పర్యటన అంటున్నారు. మొన్న టీడీపీ టీమ్ వచ్చి అబద్దాలు చెప్పి వెళ్లారు.. ఇప్పుడు చంద్రబాబు వస్తానంటున్నారు. నాలుగంటే నాలుగే భవనాలు కట్టారు.. ఈ బిల్డింగులు 50 నుంచి 90 శాతం మేర కట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులూ కడతారు. వారు ఇంకా ఎక్కువగానే కడతారు

ఐదేళ్లు అవకాశమిస్తే నిర్మించకుండా ఏం చేశారు..? గొర్రెలు కాశారా..?

ఐదేళ్లకు కాకుండా యాభై ఏళ్లకు అవకాశం ఇచ్చారని చంద్రబాబు భావించినట్టున్నారు. అధికారంలో ఉన్ననాళ్లూ వేటినీ పూర్తి చేయకుండా తనే విధానాలనే ఇప్పటి ప్రభుత్వం కూడా అమలు చేయాలని చంద్రబాబు పట్టుపడుతున్నారు. చంద్రబాబు విధానాలన్నీ వల్లకాడు విధానాలే. రాజధాని రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధి, కౌలు వంటి అంశాలపై ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. రాజధానిలో ఏం చేయకుండా పర్యటనకు ఏ విధంగా వస్తారు..? రాజధాని పర్యటనకు వస్తే.. రైతులడిగే ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు..? 35 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నారు మరి వాటిని ఎందుకు తన హయాంలో అభివృద్ధి చెయ్యలేదు? ల్యాండ్ పూలింగ్ నిబంధనలకు మేము కట్టుబడి ఉన్నాం. భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాము. చంద్రబాబు ముందు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లక్ష కోట్ల బడ్జెట్ వేసి.. సుమారు 5 వేలకోట్లు మాత్రమే రాజధాని కి ఉపయోగించారు. ఇంతకంటే అన్యాయం ఉందా.? 2015 అక్టోబర్ లో ప్రధాని శంఖుస్థాపన చేస్తే అమరావతి కి 3,4 ఏళ్లలో 4900 కోట్లు అంటే సంవత్సరానికి 1500 కోట్లు మాత్రమే ఊపయోగించారు అంటే అసలు రాజధాని ఎప్పుటికి కడదామని అనుకున్నాడు చంద్రబాబు.?భూములు తీసుకున్న రైతులకు అన్నా ఫ్లాట్ లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన బాధ్యతా నెరవేర్చలేదు. ఇంత అన్యాయం చేసి.. ఇప్పుడు తగుదనమ్మా అంటూ పర్యటనకు వస్తారా..? రాజధాని రైతులు చంద్రబాబు మాయలో పడొద్దు. ప్రతిపక్షంలో ఉన్నామని చంద్రబాబు ఏదేదో మాట్లాడ్డం.. ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. హడావుడి చేయడం.. ప్రజల నుంచి తిరస్కరణ గురి కావడం.. దాంతో సైలెంట్ అయిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఇదే విధంగా వ్యవహరించింది. రాజధానిపై అధ్యయనం చేస్తోన్న కమిటీ రిపోర్ట్ మేరకు రాజధానిపై నిర్ణయం ఉంటుంది. త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. కొంత సమయం కావాలని సీఎం జగన్ను నిపుణుల కమిటీ కోరింది, అయినా, సిఎం గారు మధ్యంతర నివేదిక ఇవ్వాలని సూచించారు. అమరావతికి గుర్తింపు తెచ్చింది ప్రస్తుతమున్న ఐదుగురు టీడీపీ ఎంపీలే అయితే.. ఐదేళ్లపాటు చంద్రబాబు ఏం చేయనట్టేగా..? చంద్రబాబుది ఏం పుట్టుకో..? ఏం మనిషో..?

అమరావతి పట్టణమా..? గ్రామమా..? అనేది ఇంకా తేలలేదు.. చర్చ జరుగుతోంది.. త్వరలో నోటిఫై చేస్తాం.

చంద్రబాబు ఎప్పుడు ఎవర్ని తిడతారో.. ఎవర్ని పొగుడుతారో.. ఎవ్వరికీ తెలియదు. జగన్ ఎవరికి దగ్గర కాదు.. దూరం కాదు. జగన్ ప్రజలందరికీ దగ్గరే.

దేశం మొత్తం మీద ఆరు నెలలకాలంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో అంశాలు ఇంతలా అమలు చేసినట్లు ఉందా . గత ప్రభుత్వాలు కనీసం పది శాతం కూడా ఆరు నెలల కాలంలో అమలు చేయలేదు. వైయస్ జగన్ గారి నాయకత్వానికి , అంకితభావానికి, నిబద్ధతకు ఇవే నిదర్శనం.రాజధాని కి రైతులకు G.O. ప్రకారం రావాల్సిన అన్ని హామీలు నెరవేర్చుతాం.అవినీతి ఆపడానికి ఒక toll ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం అనేది దేశం.లోనే మొదటిసారి.అది మేము చేసామ పవన్ కళ్యాణ్ కి ఇవన్నీ కనిపిస్తున్నాయా?ఆయన కోరస్ లాగా మారాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here