చంద్రబాబు దీక్ష షెడ్యూల్ విడుదల

22

రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈనెల 20న ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు.దీక్షకు సంబంధించి ఆయన పార్టీ నేతలతో చర్చించి షెడ్యూల్ విడుదల చేశారు.ఉదయం 9 గంటలకే దీక్షలో కూర్చోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.సాయంత్రం దళితతేజం-తెలుగుదేశం బహిరంగ సభలో పాల్గొననున్నారు.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నియోజకవర్గ కేంద్రాలు… మండల, జిల్లా కేంద్రాల్లో నేతలు దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.సోమవారం జరిగే టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు.దీక్షకు సంబంధించి గ్రామ, మండలస్థాయి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.టెలికాన్ఫరెన్స్‌లో దాదాపు 500 మంది టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తాజా రాజకీయ పరిణామాలు… 20న దీక్షపై టీడీపీ నేతలతో సీఎం మాట్లాడారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం, బీజేపీ నేతల వ్యాఖ్యలు… కేంద్రంలో టీడీపీ మంత్రుల రాజీనామాలపై కేడర్‌కు బాబు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here