చంద్రబాబుతో ముకేష్ అంబానీ భేటీ

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అమరావతి చేరుకున్నారు. ముకేష్‌కు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఆ తర్వాత సచివాలయం చేరుకున్న ముకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను పరిశీలించారు.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ విధంగా జరుగుతుంది? ముఖ్యంగా గ్రామాల నుంచి సచివాలయం వరకు ఏ విధంగా కనెక్టయి ఉందన్నవిషయాన్ని సీఎం స్వయంగా ఆయనను పక్కన కూర్చొబెట్టుకుని వివరించారు. గ్రామాల్లో ఏమైనా అంశాలు జరిగినప్పుడు వాటి సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సచివాలయంలో ఉన్న తన డ్రా బాక్స్‌లో కనిపించే విధంగా పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీని చూసిన ముకేష్ ముగ్ధుడయ్యారు. ఇటువంటి టెక్నాలజీ విదేశాల్లోనే కాదు.. ఎక్కడా లేదన్నారు.

ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు ఫైబర్ గ్రిడ్ ఎలా పనిచేస్తుందో కూడా ముఖ్యమంత్రి ముకేష్ అంబానీకి వివరించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా గ్రామాల్లో ఫోన్, ఇంటర్ నెట్, టీవీ మూడు ఒకే వైర్ ద్వారా ఇవ్వడం చాలా అరుదైన విషయమని ముకేష్ అన్నారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *