చందమామతో..రానా

39

 

rana and kajal

మూవీ మొఘల్ రామానాయుడు మనవడిగా లీడర్ మూవీతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చాడు రానా. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా… రానాకు ఇంకా స్టార్ స్టేట‌స్‌… స‌రైన మార్కెట్ మాత్రం ఏర్ప‌డ‌లేదు. బాహుబలి సినిమాలో బ‌ల్లాల‌దేవుడిగా ఇండియా వైడ్‌గా సూప‌ర్ పాపులారిటీ సంపాదించుకున్న రానా… సోలో హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ మూవీతో తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు.
దాంతో పాటు తెలుగు, త‌మిళ్‌, హిందీ సినిమాల్లో చాలా స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తూ అన్ని భాష‌ల్లోను మంచి న‌టుడిగా ఫ్రూవ్ చేసుకున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత రానా ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. దీంతో రానా ఇప్పుడు సోలో హీరోగా స్టార్ స్టేట‌స్ కోసం ట్రై చేస్తున్నాడు. ప్ర‌స్తుతం రానా బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ పార్ట్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కుతున్న ఘాజీ సినిమాల్లో నటిస్తున్నాడు రానా.
ఈ రెండు సినిమాల త‌ర్వాత రానా ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టించేందుకు ఓకే చెప్పాడ‌ని టాక్‌. నువ్వు నేను, చిత్రం, జ‌యం సినిమాల‌తో డిఫ‌రెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో రానా తొలిసారిగా ఇద్దరు ముద్దుగుమ్మ‌ల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ మూవీలో తేజ 2006లో హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు స‌రైనోడు హిట్‌తో జోష్ మీద ఉన్న కేథ‌రిన్ థెస్రా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
కాజ‌ల్ తేజ డైరెక్ష‌న్‌లో ద‌శాబ్దం త‌ర్వాత మ‌రోసారి న‌టిస్తోంది. ఈ సినిమాతో రానా మాస్ హీరోగా త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అలాగే హిట్ కోసం దండ‌యాత్ర‌లు చేస్తోన్న తేజ‌కు సైతం ఈ సినిమాతో హిట్ ఎంతో అవ‌స‌రం. మ‌రి ఈ కాంబినేష‌న్ ఈ ఇద్ద‌రికి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాకు అనూప్ సంగీతం అందిస్తుండ‌గా, మిగిలిన సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here