గ్రామాల్లో కక్షలు పెంచేందుకు డబ్బు సంచులతో వస్తున్నారు!!

48

రాష్ర్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని, సంక్షేమ పథకాలు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం విజయవాడ రూరల్ మండంలోని పైడూరుపాడు గ్రామంలో జరిగిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సభలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ, నవ్యాంధ్రను కరువు రహిత రాష్ర్టంగా మార్చేందుకు పట్టిసీమ, పోలవరం వంటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడితే, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా రాద్దాంతం చేస్తున్నాడని, పట్టిసీమ నీళ్ళను తాము ఎత్తుకుపోతున్నామని కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని మంత్రి ఉమా ఆరోపించారు. పట్టిసీమ చేపట్టినందునే కృష్ణాడెల్టా రైతుల దాదాపు 13లక్షల ఎకరాల పంటను కాపాడగలిగామని చెప్పారు. మైలవరం ప్రజలు ఎంతో చైతన్యవంతులను, వారి ఓటు ఎంతో విలువైందని అంటూ మైలవరం ప్రజల దీవెనలతోనే తాను జలవనరుల శాఖకు మంత్రినయ్యాయని పేర్కొన్నారు. గ్రామాలను కలుషితేం చేసేందుకు, కుల,మతలాను రెచ్చగొట్టేందుకు కొత్త నాయకులు డబ్బు సంచులతో వస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 20ఏళ్లు మైలవరం నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ పర్యటించని ఈ కొత్త నాయకులకు ఎన్నికలకు ముందు మైలవరం ప్రజలు గుర్తుకురావటం శోచనీయమని చెప్పారు. డిసెంబర్ నాటికి విజయవాడ రూరల్ మండలంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తామని, ఇందుకు ఇంటింటికీ కుళాయి పథకంలో భాగంగా విజయవాడ రూరల్ కు రూ.32.50కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రైతుకు మేలు జరగాలనే సత్సంకల్పంతో జూన్ 16వ తేదీన గోదావరి నీళ్లు వదిలామన్నారు. పైడూరుపాడులో జరిగిన రూ.7.44కోట్ల అభివృద్ధి పనులకు పైలాన్ ఆవిష్కరణ చేసారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here