గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం కేసులో మరో కొత్త అంశం!

83

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం కేసులో మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. కిరీటాలు మాయమైన కల్యాణ వేంకటేశ్వర స్వామి గుడిలో సీసీ కెమెరా పనిచేయడం లేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. సమాచారం బయటకి పొక్కకుండా తితిదే విజిలెన్స్‌ సిబ్బంది గోప్యత పాటిస్తున్నారు.ఉపాలయంలోకి భక్తులను అనుమతించకుండా విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.కలియుగ దైవమైన తిరుమల శ్రీనివాసుడి అన్నయ్య గోవిందరాజస్వామి ఆలయంలోని ఉత్సవమూర్తుల విగ్రహాలకున్న మూడు కిరీటాలు శనివారం సాయంత్రం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.విలువైన వజ్రాలు పొదిగిన కిరీటాలే కన్పించడం లేదని తెలుస్తోంది.ఈ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో కలకలం రేపింది.గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు ప్రతిరోజూ సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు.ప్రత్యేక రోజుల్లో స్వామివారితోపాటు అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వాహనాల్లో ఊరేగిస్తారు.వారికి అలంకరించేందుకు వివిధ వజ్రాభరణాలతో కూడిన ఆరు పురాతన కిరీటాలున్నాయి.వాటిని సాధారణ రోజుల్లో మూలవిరాట్టుకు సమీపంలోనే ఉంచుతారు.ఒంటిపై ఒక జతతోపాటు మరో జత కిరీటాలు, హారాలు విడిగా ఉంటాయి.శనివారం ఉదయం సుప్రభాతసేవ సమయంలో కనిపించిన ఉత్సవమూర్తుల కిరీటాలు తర్వాత మాయమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here