గుండె, కిడ్నీలుకు పూర్తిగా ఉచిత వైద్యమే

95

puttaparthi-hospitalగుండెజబ్బులతో బాధపడుతున్నారా…? కిడ్నీలు పాడయ్యాయని చింతిస్తున్నారా…? వాటికి ఆపరేషన్లు చేయించుకోవడానికి ఆర్ధిక స్థోమత లేదని కుమిలిపోతున్నారా…? అయితే ఒక్క నిమిషం దీనిని చదవండి. గుండె, కిడ్నీలు, కళ్ళ వ్యాధులకు పూర్తిగా ఉచిత వైద్యం అందించే ఆసుపత్రి ఉందని మీకు తెలుసా…? అవును మీరు చదువుతున్నది నిజమే…ఎటువంటి గుండె జబ్బుకైనా, రెండు కిడ్నీలు దెబ్బతిన్నా కూడా, కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యకైనా శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్న ఈ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ జబ్బులతో పాటుగా ఎముకలకు సంబంధించిన సమస్యలకు, ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లను కూడా ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఈ ఆసుపత్రి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో ఉంది. అనంతపురం నుండి పుట్టపర్తికి ప్రతి అరగంటకూ ఒక బస్సు ఉంది.అదే విధంగా వివిధ ప్రాంతాల నుండి పుట్టపర్తికి రైల్వే సౌకర్యం కూడా ఉంది.
మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని తెలియజేసి ప్రాణాలను రక్షించడంలో మీ వంతుగా తోడ్పడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here