గుంటూరులో కొత్తగా సీమాట్ కేంద్రం: మంత్రి గంటా

174

ఎస్.ఎస్.ఎ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని ఆదేశం. విద్యా రంగంలో విద్యా ప్రమాణాలు మరింత పెంపొందించేందుకు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వివిధ అంశాలపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చేందుకు State Institute of Education, Monitaring and Training (SIEMAT) సంస్థ ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ అంశాలపై చర్చించారు. గుంటూరులోని జిన్నా సెంటర్ లో ఉన్న ఉర్దూ స్కూల్ దగ్గర ఉన్న మూడెకరాల స్థలంలో అర ఎకరం విస్తీర్ణంలో ఈ సీమాట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీమాట్ కోసం ఒక్కో అంతస్తు 4,500 చ.అ.లతో మొత్తం 18,000 చ.అడుగులతో నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మించాలని, ఇందుకోసం 3 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. ఈ సీమాట్ కేంద్రం సర్వశిక్షా అభియాన్ లో భాగంగా ఉంటూ ఏపీలో నైపుణ్యాల పెంపునకు దోహదం చేయనుంది.

సర్వశిక్షా అబియాన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,586 కోట్ల రూపాయాలు నిధులు వెచ్చిస్తున్నామని, ఆయా నియోజకవర్గాల్లో ఈ పథకాల కింద జరిగే వివిధ అభివృద్ధి పనుల వివరాలను, నిధుల విడుదలను ఎప్పటికప్పుడూ సంబంధింత నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తెలియజేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here