గిరిజనుల ద్రోహి చంద్రబాబు -వైసీపీ

52

రాష్ర్టంలో గిరిజన చట్టాలకు తూట్లు పొడిచి వారిని అభివృద్దిని ఆమడదూరంలో ఉంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని వైసిపి గిరిజన విభాగం అద్యక్షుడు తెల్లంబాలరాజు విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో గురువారం జరిగింది.సమావేశంలో ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.గిరిజనుల సంప్రదాయాలకు గుర్తుగా డ్రమ్స్ మోగించారు.ఈ కార్యక్రమానికి వైసిపి ఎస్టీ విబాగం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మేరాజోత్ హనుమంతనాయక్ అధ్యక్షత వహించారు.తెల్లంబాలరాజు మాట్లాడుతూ రాష్ర్టంలో గిరిజన ప్రాంతాలలో అబివృద్ది అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందని అందువల్ల పార్లమెంట్ ,శాసనసభలకు జరిగిన ఎన్నికలలో అత్యదికమంది ఎంఎల్ ఏలను, ఎంపీలను వైఎస్సార్ కాంగ్రెస్ వారినే గిరిజనులు గెలిపించారని తెలిపారు.ఇది మనస్సులో పెట్టుకున్న చంద్రబాబునాయుడు గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ గిరిజనలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా కక్షతో వ్యవహరిస్తున్నారని అన్నారు.గిరిజనులు విషజ్వరాలకు లోనైనా,కీళ్లవాపులకు గురైనా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.గిరిజనులకు ఇవ్వాల్సిన నిధులు దారిమళ్లిస్తూ వారికి కనీస మౌళికసదుపాయాలు కూడా ఏర్పాటుచేయడం లేదన్నారు.చంద్రబాబు గిరిజనులకు ద్రోహిగా మారారని అదికారంలో ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనులకు అత్యదిక ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వారికి ఆరాధ్య దైవం గా మారారని అన్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం గిరిజన ప్రాంతాలలో పర్యటించినపుడు అక్కడి బాదలు తెలుసుకుని వారికి ఆరోగ్య,విద్యవకాశాలు కల్పించాలని నిర్ణయించుకుని రాష్ర్టంలోని ఐటిడిఏల పరిదిలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి,మెడికల్ కాలేజ్ ,ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని ప్రకటించారని అన్నారు.వచ్చే ఎన్నికలలో సైతం గిరిజనులు వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన ఉంటారని ప్రకటించారు.గత ఏడాది అరకులోయలో పర్యటించి అలవికాని వాగ్దానాలు చేసి ఏడాది కాలం గడిచినా ఒక్క హామీని కూడా నెరవేర్చని ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు.తిరిగి అక్కడకే వెళ్తే గిరిజనులు నిలదీస్తారని భయపడి ఈరోజు కోటిన్నర ఖర్చుతో గిరిజన మహోత్సవం అంటూ పాడేరు లోఆర్బాటాలు చేస్తున్నారని విమర్శించారు.వైసిపి ఎస్సీ సెల్ ఛైర్మన్ శ్రీ మెరుగు నాగార్జున మాట్లాడుతూ రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన చట్టాలను తూచతప్పకుండా అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డి దని అన్నారు.వారి స్దితిగతులను మెరుగుపర్చేందుకు అటవి హక్కుల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు.ఆనాడు నేను ఎస్సిఎస్టి కమీషన్ ఛైర్మన్ గా దగ్గరగా చూశానన్నారు.జిల్లాల్లో గిరిజనులకు మంచి హాస్టళ్లు నిర్మించాలని,జనాభా ప్రాతిపదికన ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయడానికి ఎన్నో అంశాలు వారికాలంలో జరిగాయన్నారు.అందుకనే ప్రతి గిరిజనుడి గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కొలువున్నారని అన్నారు.అందుకే కృతజ్ఞతగా గిరిజన నియోజకవర్గాలలో వైఎస్ జగన్ నిలబెట్టిన అబ్యర్దులను గెలిపించారని తెలియచేసారు.అదే బాటలో వైఎస్ జగన్ కూడా గిరిజనుల అభివృద్ది కోసం అనేక పధకాలు ప్రకటించారని అన్నారు.చంద్రబాబుకు ఎస్సిలన్నా ఎస్టీలన్నా ఏహ్యాబావం ఉందన్నారు.అందుకనే ఎస్సీలలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని…గిరిజనులకు చదువురాదంటారు..ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తిని ఎస్సీలు ఎస్టీలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.గిరిజనులకు ఉన్న మంత్రికి గిరిజనుల సమస్యలు ఏమాత్రం పట్టవని అన్నారు.చంద్రబాబును ప్రశ్నిస్తున్నా గిరిజనుల హక్కులను కాలరాస్తున్న మీరు మీ మంత్రి ఎస్టీ నిధులను ఎంత ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారో బహిరంగంగా ప్రకటించగలరా అని అన్నారు.దళిత గిరిజనుల రక్షణ వైఎస్ కుటుంబానికే సాద్యమని టిడిపి హయాంలో దలితులకు గిరిజనులకు రక్షణ కరవైందని అన్నారు.

వైసిపి సీనియర్ నేత,మాజిఎంఎల్ ఏ శ్రీ కుంభా రవిబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు అభివృద్ది పధంలో నడవాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి 1993 ఆగష్టు 9 వతేదీన ప్రపంచఆదివాసి దినోత్సవం జరపాలని నిర్ణయించిందన్నారు.140 దేశాలు ఐక్యరాజ్యసమితి లో దీనిపై సంతకం చేస్తే అందులో భారతదేశం కూడా ఒకటి అన్నారు. ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగాను భారతదేశంలోను గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలియచేసారు.రాష్ర్టంలో మొట్టమొదట ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించింది డాక్టర్ వైఎస్ రాజశేకరరెడ్డిగారని తెలిపారు. రాష్టంలో 30 లక్షలమంది గిరిజనులు ఉంటే వారిలో 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలియచేసారు.వీరందరూ కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు శ్రీ వైఎస్ జగన్ వెంట నడుస్తానికి నిర్ణయించుకున్నారని తెలిపారు.దేశంలో ఇంకాఅడవులలో కొెండల్లో కోనల్లో జీవితాలను కొనసాగిస్తూ అభివృద్దికి ఆమడదూరంలో ఉన్నారని తెలిపారు. భారతదేశంలో 11 కోట్ల మంది 461 కమ్యూనిటిలు గిరిజన తెగలలో ఉన్నాయని అన్నారు. చంద్రబాబునాయుడు గిరిజనులకు అనేక వాగ్దానాలు చేసి వాటిలో ఏ ఒక్కటి అమలు చేయకుండా మోసం చేసారని తెలిపారు.చంద్రబాబు,నక్కా ఆనందబాబు లు రాష్ర్టంలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేసుకుని గిరిజనులకు 520 కోట్లతో అబివృద్ది ప్రణాళిక చేస్తున్నట్లు అందులో పేర్కన్నారు.ఇదంతా మోసం అన్న్నారు.వైఎస్ హయాంలో గిరిజనులకు ఏం కావాలన్నా వెంటనే అమలు చేసేవారని తెలిపారు.నేడు గిరిజనులను వారి సమస్యలను పట్టించుకుోనేవారు కరవయ్యారని తెలిపారు.చంద్రబాబు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారని అన్నారు. గిరిజనులకు రో్డ్లు,ఆరోగ్యసదుపాయాలు,విద్యవకాశాలు ఏమి లేకుండా నేటి రోజులలో కూడా జీవిస్తున్నారని ,ఇంకా కొన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయాలు కుడా లేవని అన్నారు.
ఈ సందర్బంగా గిరిజనుల విల్లంబులు నేతలు ఎక్కుపెట్టారు.సమావేశంలో పార్టీ ఎస్టీ విభాగం రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు మేడా రమేష్ ,మేరాజోత్ హనుమంతనాయక్ ,గుండె సురేంద్ర,ఎం చిరంజీవి,పార్టీ సంయుక్త కార్యదర్శి కాలే పుల్లారావు,విజయవాడ పార్లమెంట్ ఎస్సీ సెల్ అద్యక్షుడు తోకల శ్యామ్ ,ఎస్సీ సెల్ నగర అద్యక్షుడు బూదాల శ్రీనివాసరావు,కార్పోరేటర్ కావేటి దామోదర్ ,డాక్టర్స్ సెల్ జిల్లా అద్యక్షుడు శ్రీ మహబూబ్ షేక్ ,ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యయన కమిటి మెంబర్ సోని కమల తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here