గిరిజనులు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది-మంత్రి శిద్దా రాఘవరావు

47

రాష్ట్రంలో గిరిజనులు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ శిద్దా రాఘవరావు అన్నారు. గురువారం ఒంగోలు పాత జిల్లా పర్షిత్ సమావేశ మందిరములో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం కార్యక్రమము జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ శిద్దా రాఘవరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారింబిoచారు.ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి మాట్లాడుతూ భారతదేశం లో ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, అటవీహక్కులు కల్పించడానికి 1994 సంవత్సరం లో ఐక్యరాజ్య సమితి చట్టం చేసిందని ఆయన అన్నారు. ఆరోజు నుండి ప్రపంచంలో అన్నిగిరిజన ప్రాoతాల్లోప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమాలను నిర్వహించడము జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గిరిజనులనుసామాజిక, ఆర్థిక ముగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో గిరిజనులు ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఏ కొటూరిజం ప్రాజెక్టు లో స్థానిక గిరిజన ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రా0తాల్లో పిల్లలకుఅంగన్ వాడి కేంద్రాలు,స్కూలు భవనాలు, మెటల్ రోడ్డులు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.రాష్ట్రంలో44వేల73 మందికి13 వేల ఎకరాల భూములుపంపిణీ చేశామన్నారు.రాష్ట్రంలో80కోట్ల రూపాయల తో66 వేల మందికి పెన్షన్స్ పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 2వేల431మంది కి భూమి హక్కు టైటిల్ డీడ్ బుక్స్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు శ్రీ కరణo బలరామ కృష్ణ మూర్తి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విద్యా అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడము జరిగిందన్నారు.

గిరిజనులుఇచ్చినమాట కు కట్టుబడి ఉంటారని అయన అన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజన పాఠశాల లు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించడాని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ వీ.వినయ్ చంద్ మాట్లాడుతూ గిరిజనులు మైదాన ప్రాoతానికి దూరంగా ప్రకృతి కి దగ్గరగా ఉంటారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఉన్నారన్నారు. ఆటవి ప్రాoత ములో అభివృద్ధి కి దూరంగా ఉన్నారన్నారు. గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశోధిoచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రకటించడము జరిగిందన్నారు. జిల్లాలో 56 మండలాలలో 2వేల 400 గిరిజన పల్లెలు ఉన్నాయాన్నారు. జిల్లాలోగిరిజన ప్రాంతాల్లో 2017-18సంవత్సరం లో 12 కోట్ల60 లక్షలు తో 34 తారురోడ్డు మంజూరు చేసా మన్నారు. జిల్లాలో 9.30 కోట్లు రూపాయల తో 40 కిలో మీటర్లు మెటల్ రోడ్డులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో మంజూరు చేసి పనులు డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా ప్రకాశము జిల్లాలో653 మందికి19.5 సెంట్లు గృహ నిర్మాణ కోసము గిరిజనులకుఇంటి పట్టాలు మంత్రి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ కరణము బలరాం కృష్ణ మూర్తి, రాష్ట్ర ఆటవి అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ దివి శివ రామ్,జాయింట్ కలెక్టర్ శ్రీ ఎస్.నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ శ్రీ నిశాంతి, జాయింట్ కలెక్టర్2 శ్రీ డీ. మార్కండేయు లు,గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి రాజ్యలక్ష్మి, డీ. ఆర్.డి. ఏ ప్రాజెక్టు అధికారీ శ్రీ ఏం. ఎస్.మురళి,డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు. ,బి.సి.సంక్షేమ శాఖ కార్యనిర్వాహక అధికారి లక్ష్మీ దుర్గ,గిరిజన సంఘము నాయకులు శ్రీ పెరమ సత్యం, శ్రీరామ శ్రీను,విష్ణు నాయక్, ,పీ.లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here