క్వారంటైన్ లో కామపిశాచి!

301

ముంబై/ పాన్ వెల్: కరోనా వైరస్ (COVID 19) లక్షణాలు ఉన్నాయని క్వారంటైన్ లో 40 ఏళ్ల మహిళ చికిత్స పొందుతున్నది. త్వరగా వ్యాధి నయం కావాలని, తాను ఇంటికి వెళ్లాలని ప్రతినిమిషం ఆమె దేవుడిని ప్రార్థిస్తోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన యువకుడిని అదే క్వారంటైన్ లో పెట్టారు. ఆమె మీద కన్ను వేసిన కామాంధుడు నేను డాక్టర్, నేను చెప్పింది నువ్వు వినాలి, మీకు మసాజ్ చెయ్యాలి అంటూ ఆమెను నగ్నంగా తయారు చేసి బాత్ రూంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. కామాంధుడి అసలు స్వరూపం బయటపడటంతో అతనికి అధికారులు సరైన ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.శుక్రవారం రాత్రి 7. 30 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ గదిలోకి ఆ యువకుడు వెళ్లాడు. మేడమ్….. నేను డాక్టర్, మీ ఆరోగ్యం ఎలాగుంది ? సమయానికి మందులు వేసుకుంటున్నారా ?, టైంకు నర్సులు వచ్చి వెలుతున్నారా ? అంటూ ఆమెను మాటల్లో దింపాడు. మీకు మసాజ్ చెయ్యాలని సీనియర్ డాక్టర్లు చెప్పారు, ఇక్కడ మేము చెప్పినట్లు మీరు వినాలి అని ఆమెను నమ్మించాడు.నిజంగా డాక్టర్ అని మోసపోయిన మహిళ అతను చెప్పినట్లు వినింది. ఆమెను నగ్నంగా చేసి మసాజ్ చేసినట్లు నటించిన కామాంధుడు ఆమెను బాత్ రూంలోకి లాక్కెళ్లి నోట్లో బట్టలు కుక్కి అత్యాచారం చేశాడు. తరువాత అతను తప్పించుకుని అతని గదిలోకి వెళ్లిపోయాడు. మహిళ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు క్వారంటైన్ లో అందర్ని విచారించి చివరికి కామాంధుడిని పట్టుకున్నారు.

ఖాళీగా ఉన్నానని ప్రముఖ మాల్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్నాడు. అన్నకు భోజనం ఇవ్వడానికి వచ్చి అతనికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉన్నాడని అధికారులు అన్నారు. కామాంధుడి మీద అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యాడని, మహిళ మీద అత్యాచారం చేశాడని కేసులు నమోదు చేశామని పాన్ వెల్ పోలీసులు తెలిపారు. క్వారంటైన్ కేంద్రంలో వివాహిత మహిళపై అత్యాచారం జరిగడానికి అధికారుల నిర్లక్షమే కారణం అని పలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here