క్లైమాక్స్ సీన్లో ఏడ్చేశా-విజయ్ ఆంటోనీ

41

Bichagadu-Press-Meet

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ను తెలుగులో బిచ్చగాడు అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… సంగీత దర్శకుడు, హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘’ తెలుగులో నకిలీ, డా.సలీం తర్వాత నేను చేసిన మూడో సినిమా బిచ్చగాడు. తమిళంలో పిచ్చైకారన్ పేరుతో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. తెలుగులో కూడా అదే రేంజ్ సక్సెస్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ తో నేను చేసే ప్రతి సినిమాను తెలుగు, తమిళంలో విడుదల చేయాలని అనుకుంటున్నాను. అందుకు తగిన విధంగా ప్లాన్ చేస్తున్నాను. సాధారణంగా నేను కథలనే నమ్ముతాను. హీరోయిజం కంటే స్క్రిప్ట్ హీరో. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడిదే. సినిమా కథ వినగానే బాగా ఏడ్చాను. ముఖ్యం క్లైమాక్స్ సీన్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఈ సినిమాకు నేను నటించడంతో పాటు మ్యూజిక్ అందించాను, అలాగే తమిళంలో నిర్మాతగా వ్యవహరించాను. ఈ మూడు పనులు చేయడానికి నేను టెన్షన్ పడలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. ప్రస్తుతం యముడు, సైతాన్ చిత్రాల్లో నటించాను. తర్వాత డా.సలీంకు సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను’’ అన్నారు.
రచయిత బాషా శ్రీ మాట్లాడుతూ ‘’విజయ్ ఆంటోనిగారితో దరువు సినిమా నుండి పరిచయం ఉంది. ఈ సినిమా సమంయలో నన్ను పిలిచి తెలుగు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్ ఉండాలన్నారు. నేను కూడా అదేవిధంగా కష్టపడ్డాను. ఇప్పుడు ఆడియెన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చాలా బావుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘’టైటిల్ చూసి తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననుకున్నా అయితే ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాను 120 థియేటర్స్ లో విడుదల చేశాం. మరిన్ని థియేటర్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి’’ అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here