రివ్యూ: క్లాసిక్ ఎంటర్ టైనర్ ‘మజ్ను’

89

నటీనటులు: నాని, అను ఇమ్మాన్యుయొల్, ప్రియశ్రీ, వెన్నెల కిశోర్, సత్య, రాజ్ తరుణ్(క్యామియో), ఎస్.ఎస్.రాజమౌళి(గెస్ట్ రోల్, అతని కుమారుడు), గబ్బర్ సింగ్ రౌడీ బ్యాచ్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌
నిర్మాత: కిరణ్.పి.
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విరించి వర్మ
రేటింగ్: 3.25
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నాచురల్ స్టార్ నాని. గతంలో కొన్ని సినిమాల ఫ్లాపులు కావడంతో… ఆ తరువాత రూట్ మార్చి ఎవడే సుబ్రమణ్యం లాంటి వైవిధ్యమైన స్టోరీని ఎంచుకుని హిట్ కొట్టాడు. ఆ తరువాత ఇక వెనుదిరిగి చూడలేదు. వెను వెంటనే భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జంటిల్ మన్.. ఇలా వరుసగా హిట్టుమీద హిట్టు కొడుతూ దూసుకుపోతున్నాడు. మొన్న విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’లో కూడా క్యామియో చేశాడు. ఇప్పుడు మజ్ను మూవీతో మన ముందుకొచ్చాడు నాని. ఉయ్యాలా జంపాలా చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా కూడా గత చిత్రాల్లాగే హిట్టుకొట్టే కంటెంట్ వుందేమో చూద్దాం.
స్టోరీ: ఇంజినీరింగ్ చదివి దర్శకుడు రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆదిత్య(నాని)… తన మిత్రుడు కాశీ(సత్య) ఆఫీసులో పనిచేసే సుమాంజలి(ప్రియశ్రీ)ని ప్రేమిస్తాడు. ఆమెతో తనకు గతంలో వున్న లవ్ స్టోరీని కూడా రివీల్ చేస్తాడు. దాంతో ఆదిత్య నిజాయతీని మెచ్చి.. ప్రేమలో పడుతుంది సుమాంజలి. అయితే ఆదిత్య మనసులో మాత్రం మాజీ ప్రియురాలే వుంటుంది. అది తెలుసుకుని తన సొంతూరు భీమవరం వెళుతుండగా… సుమాంజలితో కలిసి తన మాజీ ప్రియురాలు కిరణ్మయి(అను ఎమ్మాన్యుయొల్) రైల్వేస్టేషన్లో ఎదురొస్తుంది. ఆ కాంబినేషన్ చూసి షాక్ గురవుతాడు ఆదిత్య. ఇంతలో సుమాంజలి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య అని కిరణ్మయికి పరిచయం చేస్తుంది. అక అక్కడి నుంచి ఆదిత్యకు కష్టాలు మొదలవుతాయి. మనసార ప్రేమించిన కిరణ్మయిని ఎదురుగా పెట్టుకుని… సుమాంజలితో కలిసి చేసే షికార్లతో ఆదిత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఏమైంది అనేదే మిగతా కథ.

స్టోరీ విశ్లేషణ: ఓ మామూలు స్టోరీని కూడా నాని… తన నాచురల్ నటనతో ప్రేక్షకులు నచ్చేలా చేయగలడనేదానికి ‘మజ్ను’ చక్కటి ఉదాహరణ. అందరూ అనుకున్నట్టు ఇందులో రొటీన్ కథ..కథనాలే వుండొచ్చు. అయితేనేం.. ప్రేక్షకులు హాయిగా నవ్వుకుని బయటికి రాగల కంటెంట్ మాత్రం వుంది. రెండు పావు నిమిషాల పాటు.. సాగే ఈ సినిమా కథలో ప్లీజంట్ లవ్ స్టోరీతోనే ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు. అందుకే మజ్ను… క్లాసిక్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.
చదువు పూర్తి చేసిన అబ్బాయి.. ఓ వైపు ఉద్యోగం కోసం చూస్తూనే.. మరో వైపు తన మనసుకు నచ్చిన అమ్మాయి వెంటపడి ప్రేమిస్తుంటాడు. ఆమె ప్రేమించకపోతే… ఆమె చదువుతున్న కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా చేరి.. తన టీచింగ్ స్కిల్స్ తో ఆమెను ముగ్గులోకి దించుతాడు. ఆ తరువాత ఏదో చిన్న మిస్సండర్ స్టాండింగ్ వల్ల ఇద్దరు విడిపోవడం. ఆ తరువాత మళ్లీ ఏదో ఓ సందర్భంలో కలుసుకుని.. ఇద్దరి వైపు నుంచి వున్న తప్పులను ఒప్పుకొని ఒక్కటవ్వడం. ఇలాంటి స్టోరీలు చాలానే చూశాం. అయితే ఇందులో మరో హీరోయిన్ ను కూడా తీసుకొచ్చి ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడిపించాడు. అది చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది.
నాని ఎప్పటిలాగే… తన నటనతో ఈ సినిమాను తీరానికి చేర్చడానికి చాలా కష్టపడ్డాడు. డైలాగ్ డిక్షన్ తో గానీ.. నటనతో గానీ యూత్ ను ఆకట్టుకోవడానికి తన మార్కు కామెడీ డైలాగులతో బాగానే నటించాడు. మొదటి హాఫ్ మొత్తం ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో నడిపించి ఇంటర్వెల్ కార్డు వేసి… ఆ తరువాత ద్వితీయార్థంలో వెన్నెల కిశోర్ ను ఇంట్రడ్యూస్ చేసి.. కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఇందులో నటించిన ఇద్దరు కథనాయికలు గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చివర్లో రాజ్ తరుణ్.. సపోర్టింగ్ రోల్ చేసి.. సాహసం చేశాడు. వెన్నెల కిశోర్ కామెడీ.. సత్య స్నేహితుడిగా బాగానే చేశారు. పోసాని కాసేపు మాత్రమే కనిపించి పర్వాలేదనిపించాడు. రాజమౌళి బిగినింగ్ లోనూ… చివర్లోనూ కనిపించి నవ్వించాడు. అతడితో నాని చేసే కామెడీ బాగానే వర్కవుట్ అయింది.
నాని గత చిత్రాలంత రేంజ్ ను అందుకునే స్టోరీ.. స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విరించి వర్మ కాస్త తడబడ్డాడనే చెప్పాలి. దర్శకుడు ఓ ప్రిడిక్టబుల్ స్టోరీని తీయడానికి నాని ఎంచుకోవడం బెస్ట్ ఛాయిస్ అనిపించింది. గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. నిడివి మరింత తగ్గించే ఆస్కారం వుంది. అయినా ఎందుకో అలా వదిలేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు బాగున్నాయి. అయితే ఇంకా డెప్త్ గా రాయొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంతా భీమవరంలోనే ఎక్కువగా తీశారు కాబట్టి.. పెద్దగా ఖర్చు కనిపించదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here