క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

149

కర్నూలు నగరంలోని ఎఫ్ సి ఐ కాలనీ నందు కే ఎం సి పార్క్ వద్ద బుధవారం గ్రూపులుగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా ను జిల్లా ఎస్పీ స్పెషల్ టీం తో పాటుగా కర్నూలు పట్టణ మూడవ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేసినట్లు కర్నూలు నగర డిఎస్పీ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం పోలీసులకు రాబడిన సమాచారం మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీ టీం మూడవ పట్టణ సీఐ హనుమంతనాయక్ ఎస్ ఐ తిరుపాలు ఏ ఎస్ ఐ విశ్వనాథ్ రెడ్డి తో పాటుగా సిబ్బంది కలిసి క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను దాడులు చేసి అరెస్టు చేయడం జరిగింది. వీరిపై మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సమాజంలో ఎంతోమంది జీవితాలకు పెడదోవ పట్టిస్తున్న క్రికెట్ బెట్టింగ్ , గ్యాంబ్లింగ్ , ఇతర అసాంఘిక కార్యకలాపాల వంటి వాటిని రూపుమాపేందుకు కర్నూల్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు డిఎస్పీ తెలిపారు ఇటువంటి వాటిపై గ్యాంగ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ క్రింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రవర్తనలో మార్పు రాణి వారిపై కఠినమైన చట్టాలైనా పీడీ యాక్ట్ వంటి వాటిని ప్రయోగించడం జరుగుతుందని అవసరమైతే జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని ఆయన హెచ్చరించారు ఇదే కాకుండా మట్కా బెట్టింగ్ ఇతర అసాంఘిక కార్యకలాపాలను నడిపించే ఆస్తులను జప్తు చేసి కోర్టుకు చేయిస్తామన్నారు ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలకు ఆశ్రయం కల్పిస్తూ అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు అంతేకాకుండా గ్యాంబ్లింగ్ యాక్టు లో ముఖ్యమైన సవరణలు తీసుకుని వచ్చి దాన్ని మరింత పటిష్టంగా తయారు చేయడానికి అన్ని రాష్ట్రాలలో చట్టాలను చేస్తున్నామన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here