కోడెలకు క్షమాపణలు చెప్పిన జగన్ ఎమ్మెల్యేలు

ap-asblyసభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఎదుర్కొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌కు క్షమాపణలు చెప్పారు. తండ్రి స్థానంలో ఉన్న సభాపతి మనసు నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.19న జరిగిన సంఘటనలో ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, వ్యక్తిగతంగా స్పీకరంటే గౌరవం ఉందని, అధ్యక్ష స్థానమన్నా గౌరవం ఉందని, మేము చేసిన వ్యాఖ్యలకు సభాపతి మనసు బాధపడిఉంటే… మేం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని ఆయన అన్నారు. ఈ విధంగా మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు. సభాపతి కోడెల శివప్రసాద్‌ మాట్లాడుతూ ఎవరు ఎంత చేసినా.. తప్పు చేశామనే భావన, దానికి పశ్చాత్తాపం, క్షమాపణ.. అంతకంటే మించిన శిక్ష లేదని అన్నారు. స్పీకర్‌ స్థానాన్ని కించపరిచారనే బాధ పడ్డానని ఆయన అన్నారు. పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కాబట్టి ఉపశమనం కలిగిందని కోడెల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *