కొన్ని ప్రాంతాల్లో ముగిసిన ఐటీ సోదాలు

10

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడుల దుమారం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులను లక్ష్యంగా చేసుకుని వారికి సన్నిహితులుగా భావిస్తున్న వారి కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం మొదలైన ఐటీ సోదాలు శనివారానికి కొన్ని ప్రాంతాల్లో ముగిశాయి. వీఎస్‌ లాజిస్టిక్స్‌, శుభగృహ ఇండియా‌ప్రైవెట్ లిమిటెడ్, వీఎస్‌ ఎకోబిక్స్‌, ఎమ్మెల్యే పోతుల రామారావుకు ఐటీ నోటీసులు జారీ చేసింది.ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను ఐటీ స్వాధీనం చేసుకుంది. 8,9 తేదీల్లో విచారణకు రావాల్సిందిగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మరోవైపు మరికొన్ని చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాచవరంలోని శుభగృహ ప్రతినిధుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here