కొత్తగా రూ.350 నోటు, ఆర్బీఐ క్లారిటీ!

పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో ఆర్బీఐ మరో కొత్త నోటు రూ.350 మార్కెట్లోకి విడుదల చేస్తుందని… త్వరలోనే రూ.2000 నోటును నిలుపుదల చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాక కొత్తగా తీసుకురాబోతున్న రూ.350 నోటు ఇలానే ఉండబోతుందంటూ మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు కూడా. ఈ వార్తపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. ఇదంతా తప్పుడు వార్త అంటూ తేల్చి చెప్పింది. అంతేకాక సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించింది.

మార్ఫింగ్ చేసిన విడుదల చేసిన రూ.350 నోటు ఇమేజ్… వైల్డ్ రెడ్ కలర్లో, ఆశ్చర్యకరమైన నమూనాల్లో ఉన్నాయి. ఈ నోటును కొత్త రూ.200, రూ.50 నోట్లను మార్ఫింగ్ చేసి రూపొందించినట్టు తెలిసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది. ఈ ఇమేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవడంతో, నిజంగానే ఆర్బీఐ కొత్తగా రూ.350 నోటు తీసుకొస్తుందేమోనని ప్రజలు భావించారు. కానీ ఇదంతా తప్పుడు వార్తనేనని ఆర్బీఐ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్నది అంతా అబద్దం అని.. ఎవరూ నమ్మొద్దని వెల్లడించింది. రూ.350 నోటు విడుదల చేసే ఆలోచన, ఉద్దేశం లేదని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *