కృష్ణా పుష్కరాలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్

130

కృష్ణా పుష్కరాలపై కృష్ణా, గుంటూరు, కర్నూలు కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. యాత్రీకులసేవకు, ప్రజాసేవకు కృష్ణానదీ పుష్కరాలు ఒక అవకాశం, మన సమర్ధత నిరూపించుకునే అవకాశం,ఎక్కడా ఎలాంటి చిన్న సమస్య కూడా ఉత్పన్నం కాకుండా చూడాలి. పుష్కరాల నిర్వహణ పనుల్లో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి. ప్రజల్లో సంతృప్తి నెలకొనాలి, ఇంత బాగా చేయగలుగుతారా అని ఆశ్చర్యపోయేలా అన్నిశాఖల అధికారులు చక్కని సమన్వయంతో సమర్ధంగా పనిచేయాలి. అలమట్టి, జూరాలనుంచి ఇన్ ఫ్లో వస్తోంది, అన్ని రిజర్వాయర్లు నీటితో నింపుకోవాలి, పుష్కరాలకు నీటి నిర్వహణ సక్రమంగా చేయాలి.నీటి విడుదలపై జలవనరుల శాఖ సిద్ధంచేసుకున్న పుష్కర ప్రణాళికను అమలుచేయండి. సముద్రంలోకి వృధాగా నీరు పోరాదు. బారికేడింగ్ పకడ్బందీగా ఉండాలి. ఘాట్ ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. సుందరీకరణ పనులు పూర్తిచేయాలి. ఒక్క కాగితం ముక్క కూడా రోడ్లపై కనిపించకూడదు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలి.యాత్రీకుల రద్దీ అధికంగా ఉండే అన్ని ఘాట్ లవద్ద చంద్రన్న సంచారవైద్యశాల(మెడికల్ మొబైల్ యూనిట్లు) ఏర్పాటుచేయాలి, అత్యవసర మందులు, వైద్యం అందుబాటులో ఉంచాలి. ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్ తీసుకుంటాను, ప్రతి అధికారి, ఉద్యోగి పనితీరుకు రేటింగ్ ఇస్తాను: వివిధ శాఖలకు చెందిన 571 మంది అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here