కులాన్ని, వర్గాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు: పవన్

185

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటిని పట్టించుకోనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేశారని విమర్శించారు. తాను కులాన్ని, వర్గాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.తాను పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీఆర్‌లా ఉప్పెన లేదని, తన సోదరుడు చిరంజీవిలా ప్రవాహంలేదని.. ఎదురీదుతూ పార్టీ పెట్టానని పవన్‌ వెల్లడించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తనకు శత్రువు కాదని, తనకు శత్రువులెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బలమైన, సుపరిపాలన కోసమే ఆనాడు టీడీపీకి మద్దతిచ్చానని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. మోసాలు చేస్తే ఊరుకోనన్నారు. ప్రశ్నిస్తూ జనసేన పాలనలోకి రావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here