రివ్యూ: కామెడీ అబ్బాయి

230

తారాగణం: ఆది, నమిత ప్రమోద్, సాయికుమార్, అభిమన్యు సింగ్, చరణ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, షకలక శంకర్, జాక్ కొక్కీరన్, రఘుబాబు, కృష్ణ భగవాన్, జీవా, సురేఖావాణి, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరి, అనితనాథ్ తదితరులు
సంగీతం: థమన్.యస్.యస్
సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్ కుమార్
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
నిర్మాతలు: రామ్ తాళ్ళూరి, వెంకట్ తలారి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రమ్
రేటింగ్: 3
అహనా పెళ్లంట… పూలరంగడు లాంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వీరభద్రమ్… ‘లవ్ లీ’స్టార్ ఆది కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఇందులో తొలిసారిగా ఆది, సాయికుమార్ కలిసి నటించారు. తండ్రీకొడులు కలిసి నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం పదండి.

స్టోరీ: రికవరి ఏజెంట్ గా పనిచేసే బాబ్జి అలియాస్ చిన్నా(ఆది) అనుకోకుండా కావ్య(నమిత ప్రమోద్)ను మీ సేవ వద్ద కలుస్తాడు. వీరిద్దరూ ప్రేమలో వున్నారేమో అనుకుని ఏసీపీ అయిన కావ్య అన్న (అభిమన్యుసింగ్) బాబ్జిని స్టేషన్ కు తీసుకెళ్లి తనదైనశైలిలో ట్రీట్ మెంట్ ఇస్తాడు. దాంతో బాబ్జి కావ్యను కలవాలంటేనే బెదిరిపోతుంటాడు. అయితే అనుకోకుండా అలా రెండు మూడు సార్లు కావ్య, బాబ్జి యాక్సిడెంటల్ గా కలవడంతో.. బాబ్జిని కావ్య అన్న టార్గెట్ చేస్తాడు. అయితే అదే సమయంలో విలన్ జాన్ కొకైన్ కూడా కావ్యను చంపాలని చూస్తుంటాడు. అయితే కావ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి వెళ్లిన బాబ్జి…. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడనే కోపంతో తన అన్న మీద అలిగి కావ్య ఇంటి నుంచి గోడదూకి పారిపోతూ బాబ్జికి తారసపడుతుంది. వీరిద్దరినీ చూసిన కావ్య అన్న… తన మనుషులను పట్టుకోండని పురమాయిస్తాడు. దాంతో అక్కడి నుంచి వారు తప్పించుకుని పారిపోతారు. అలా పారిపోయిన ఈ జంట చివరికి ఎక్కడికి చేరుకుంటారు? వారి ఆచూకిని కావ్య అన్న కనుగొన్నాడా? అసలు కావ్యను విలన్ ఎందుకు వెంబడిస్తున్నాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్టోరీ విశ్లేషణ: కమర్షియల్ ఎలిమెంట్స్ మెయింటైన్ చేస్తూనే… కామెడీ సన్నివేషాలతో ప్రేక్షకులను రెండు గంటలకు పైగా థియేటర్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఎలిమెంట్స్ తో ఆద్యంతం నవ్విస్తూ.. తెరకెక్కించిన సినిమానే ‘చుట్టాలబ్బాయి’. దర్శకుడు వీరభద్రమ్ తన మార్కు కామెడీతో తెరకెక్కించిన ఈ కామెడీ అబ్బాయిని లాజిక్ లు వెతక్కుండా చూస్తే… ఫుల్ ఫన్ ఖాయం. యూత్ కి నచ్చే అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం మల్టీ ప్లెక్స్ ప్రేక్షకుల్ని కాస్త నిరాశ పరిచినా… బి,సి సెంటర్ల ప్రేక్షకులను బాగా మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.
మొదటి హాఫ్ లో మిస్టర్ ఈగోరెడ్డిగా పృథ్వీ చేసిన కామెడీతో ప్రేక్షకుల పొట్టలు చెక్కలు కావాల్సిందే. అతనికి తోడు షకలక శంకర్, గిరి, రచ్చ రవి చేసిన కామెడీ సీన్లు అదనం. ఇక లీడ్ రోల్ పోషించిన నమితా ప్రమోద్ నటన బాగుంది. సెకెండ్ లీడ్ పోషించిన యామినీ మల్హోత్ర హాట్ అందాలు కుర్రకారుని బాగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. సెకెండాఫ్ లో వచ్చే ఆలీ కామెడీ.. సాయికుమార్ సీరియస్ నటన మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి.
సంగీత దర్శకుడు యస్.యస్.థమన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆది ఇంట్రడక్షన్ సాంగ్ చాలా యూత్ ఫుల్ గా… ఎనర్జిటిక్ గా వుంది. మ్యూజిక్ కి తోడు ఆది స్టెప్పులు బాగున్నాయి. నిర్మాతలు కొత్తవారైనా.. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు చేశారు. లొకేషన్ల ఎంపిక బాగుంది. వాటిని చాలా రిచ్ గా తెరమీద చూపించారు సినిమాటోగ్రాఫర్. అయితే మూవీని కాస్త నిడివి తగ్గిస్తే.. ఇంకాస్త క్రిస్ప్ గా వుంటుంది. మొత్తానికి ‘చుట్టాలబ్బాయి’ మాస్ ప్రేక్షకులను మెప్పించనుందనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం థియేటర్లలో పెళ్లిచూపులు చిత్రం మాత్రమే క్లాసు… మాసూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా కలెక్షన్లు కూడా డ్రాప్ అయిపోయాయి. తిక్క ఎలాగూ నిరాశ పరిచింది. కాబట్టి..కామెడీ కోరుకునే వారికి చుట్టాలబ్బాయి బెస్ట్ ఛాయిస్ అనిచెప్పొచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here