కాపు రిజర్వేషన్ ల ఆమోదం పై కేంద్రంపై ఒత్తిడి తేలేని జగన్

16

కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని జగ్గంపేట సభలో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడం దారుణమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ ఆక్షేపించారు. కాపులపై ద్వేషం వెళ్లగక్కడం సరికాదని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతికులాన్ని మోసం చేశారని జగన్ అనడాన్ని తప్పుబట్టారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా అన్నికులాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారన్నారు. కాపులకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా తానేమీ చేయలేనని జగన్ చెప్పడం కాపులకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. ఆ నైజం జగన్‍లో స్పష్టంగా కన్పిస్తోందని కళావెంకటరావు విమర్శించారు. బీసీలకు ఇబ్బంది లేకుండానే కాపు రిజర్వేషన్ల చేయాలని బిల్లు చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు, జగన్-పవన్ లు బీజేపీ డైరెక్షన్లో నడుస్తోన్నారని ఆరోపించారు కాపు రిజర్వేషన్లపై మోడీని ఒప్పించాలని కళావెంకటరావు డిమాండుచేశారు, రాష్ట్ర పరిధిలో చేయాల్సింది చేసి.. కాపు రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామన్నారు, లీగల్ స్క్రూటినీలో కూడా నిలబడేలా కాపు రిజర్వేషన్ బిల్లు రూపొందించామని స్పష్టం  చేశారు బీసీలకు వీసమెత్తు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు అమలు చేయమనే కోరుతున్నామన్నారు, వైఎస్ హయాంలో కాపులు, బలిజలకు ఇవ్వాల్సిన సీట్లను వేరే వారికి ఇచ్చారని కళావెంకటరావు గుర్తుచేశారు. మోడీ డైరెక్షన్లోనే జగన్ ఈ కామెంట్లు చేశారని మంత్రి ఆరోపించారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తున్నప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్ లు 50 శాతం దాటినా కూడా కాపులకు రిజర్వేషన్ లు కల్పించడం సభభని గతంలో రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన జగన్ ఇప్పుడు మాటమార్చడం తగదన్నారు, కాపులకు రిజర్వేషన్ ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్న మాపై విమర్శించడం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా యూటర్స్ తీసుకున్నారని విశిదమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న కాపు రిజర్వేషన్ ను ఆమోదింపచేయడంలో ఒత్తిడి తేలేక జగన్ పిరికిపందలాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here