కాపుగర్జన ఉద్రిక్తంగా మారడంపై పవన్ ఆవేదన

52

Pawan-Kalyan-తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జనలో జరిగిన ఉద్రిక్త పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో జరుగుతున్న తన సినిమా సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌ను అర్థాంతరంగా నిలిపివేసి ఆయన హైదరాబాద్ బయల్దేరారు. తుని సంఘటన శాంతిభద్రతల సమస్యగా మారడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో యువత సంయమనంతో వ్యవహరించాలని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప హింసకు పాల్పడొద్దని ఆయన సూచించారు. ఈ ఘటన వల్ల ప్రయాణికులు, వృద్ధులు, పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని, రాష్ట్ర ప్రజలను కష్టాలకు గురి చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here