కలియుగదైవం పై బిజెపి వైసిపి సంయుక్త కుట్ర

105

బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అప్రతిష్టపాలు చేసే విధంగా గత 2 సంవత్సరాల కాలంగా బిజెపి వైసిపిలు సంయుక్తంగా భగవంతుని పేరుతో కుట్ర రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దానిలో భాగంగానే బిజెపి అధికార ప్రతినిధి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు ఒక పథకం ప్రకారం టిటిడి ప్రతిష్టను బ్రష్టు పట్టిస్తున్నారని, గతంలో వీరిరువురు కలిసి స్వామివారి ఆభరణాల్లో పింక్ డైమండ్ మిస్ అయిందని గగ్గోలు పెట్టిన వీరు ఇప్పుడు ఆ పింక్ డైమండ్ పూసే ఎందుకు ఎత్తట్లేదు అని, మరలా ఇప్పుడు వీళ్ళే కొత్తగా స్వామి వారికి సంబంధించిన పంజాబ్ బ్యాంకు డిపాజిట్ లో ఉన్న 1381కేజీల బంగారం ట్రాన్సపోర్ట్ అంశంపై నిత్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తూ భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి ఈ బంగారం తరలింపు విషయంలో ప్రభుత్వ ప్రమేయం లేదని, వివాదం జరిగినది కేవలం టీటీడీ అధికారుల సమాచార వైఫల్యమేనని బహిరంగంగా తెలియజేసి చంద్రబాబు ప్రభుత్వానికి క్షమాపణలు కూడా బహిరంగంగా తెలియజేశారు. అసలు వీరి అసలు ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రాజకీయ కక్షతో బదనాం చేయడం కోసం కలియుగ దైవాన్ని ఒక పావుగా వాడుకుంటున్నారని వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐవైఆర్ టిటిడి ఈవోగా పని చేసిన కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన సొంత అల్లుడి రిసార్ట్స్ కోసం తిరుమలకు ఏడుకొండలు అవసరంలేదు రెండు కొండలు చాలని జీవో ఇచ్చినప్పుడు ఐవైఆర్ కృష్ణారావు మరియు టీటీడీ అప్పటి బోర్డు మెంబర్గా పనిచేస్తున్న విజయసాయిరెడ్డిలు నోరు ఎందుకు మెదపలేదని అంతేకాక కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు వీరిరువురు టీటీడీలో బాధ్యత లో ఉన్నప్పుడు జరిగిన స్వామివారి నగల అవకతవకలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని శ్రీధర్ ప్రశ్నించారు. 2018లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వెళ్లేముందు హిందూ మత విశ్వాసాల రిజిస్టర్లో సంతకం చేయకుండా దర్శనానికి బూటు కాళ్లతో వెళ్తే ఆరోజు ఈ మాజీ ఐఏఎస్ లు ఎందుకు ప్రశ్నించలేదని రమణ దీక్షితులకు మాయమాటలు చెప్పి ఆయన అర్చక పదవి వుడిపోయే వరకు ఆయనతో కుట్ర రాజకీయాలు చేయించారని, ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఆపరేషన్ గరుడలో వేంకటేశ్వరస్వామివారిని తమ స్వార్థ రాజకీయాలకు రమణ దీక్షితులు ఆధ్వర్యంలో వాడుకున్నారని, అందుకే బిజెపి ఈ రాష్ట్రంలో స్వామివారి ఆగ్రహానికి గురై పుట్టగతులు లేకుండా పోయిందని అయినా బిజెపి లో ఎటువంటి పశ్చాతాపం లేకుండా వైసీపీ నేతృత్వంలో వెంకన్నకే విద్రోహానికి చర్యలు చేపడుతుందని, గతంలో దాని పర్యవసానం రెండు కొండలు చాలన్న వైయస్కు ఏ గతి పట్టిందో అటువంటి శిక్ష స్వామి వారు తప్పక వేస్తారని, కలియుగ దైవంతో పెట్టుకున్న ఏ రాజకీయనాయకుడు బతికి బట్టకట్టలేదని, ఇది రుజువు కూడా అయ్యిందని హెచ్చరించారు.

ప్రభుత్వ ప్రస్తుత తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఐవైఆర్ కృష్ణారావు , విజయ్ సాయిరెడ్డి ఉచ్చులో నుంచి బయటపడాలని వీరిరువురు కలసి జగన్ నేతృత్వంలో ప్రభుత్వ సిఎస్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎల్ వి సుబ్రహ్మణ్యంపై నిజంగా వీరికి అంత ప్రేమ ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డితో పాటు సి.బి.ఐ కేసులో నిందితుడిగా చేర్చినపుడు ఆయనపై ఐవైఆర్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ లు ఎందుకు సానుభూతి చూపలేదని, బీజేపీ వైసిపి నేతృత్వంలో ఈ మాజీ ఐఏఎస్ లు ఇప్పుడు ఆయనపై లేనిపోని ప్రేమ చూపుతూ ఎందుకు ఈ రాష్ట్ర రాజకీయాలలో పావుగా వాడుకుంటూ ఎల్ వి సుబ్రహ్మణ్యం భుజంపై తుపాకి పెట్టి చంద్రబాబును కాల్చాలని చేస్తున్న కుట్రను ఇప్పటికైనా ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం తెలుసుకోవాలని సూచించారు. ఆయనకు ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చినది ప్రజా సమస్యలను పరిష్కరించటానికి, రాష్ట్ర పాలన చేయడానికి మాత్రమే తప్ప, రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి పదవి ఇవ్వలేదని, గతంలో జగన్ కేసులో ఎన్నో తిప్పలు పడి బయట పడటం జరిగిందని మరల జగన్ తో చేతులు కలిపి జైలుకు వెళ్లే పరిస్థితులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఐవైఆర్ లాగా బ్రాహ్మణ కులంలో చరిత్ర హీనుడు కావద్దని హితవు పలికారు. కేవలం ఐవైఆర్ చంద్రబాబు మీద కోపంతో బీజేపీ అధిష్టానానికి తప్పుడు సమాచారం అందించి వైసీపీ జగన్ తో ఋషికేష్ ప్యాకేజీ మాట్లాడుకొని మాజీ ఐఏఎస్ లను, సామాజిక వర్గాల వారిని చంద్రబాబుపై విడతలవారిగా వుసిగోలుపుతున్నారని, ఆ ఋషికేష్ ఒప్పందాన్ని బయటపెట్టాలని, గతంలో ఐవైఆర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఏ ముఖ్యమంత్రి నమ్మి ఇవ్వకపోతే చంద్రబాబు నమ్మి ఇచ్చినందుకు మరియు రిటైర్డ్ కాగానే తాను కోరిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఈ నమ్మకద్రోహం, కుట్ర చేస్తున్నారని ఇంతటి నీచ రాజకీయం చేస్తున్న ఐవైఆర్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయలేదని ఈయనకు బిజెపి టిక్కెట్టు కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఐవైఆర్ ,వైసిపి సంయుక్తంగా టీటీడీ పై వివాదం చేయడంలో పెద్ద కుట్ర దాగి ఉందని స్వామివారి ఆభరణాలను, బంగారాన్ని దోచుకునే ప్రయత్నం లో భాగంగా గత రెండు సంవత్సరాల నుండి కలియుగ దైవాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని, ఐవైఆర్ ఈవో గా పనిచేసిన సమయంలో జరిగిన అవకతవకలను సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మాజీ ఐఏయెస్ లకు తాము పనిచేసిన సమయంలో ఈ రాష్ట్రం కోసం ఏ రోజు చిత్తశుద్ధితో పని చేయకుండా ప్రభుత్వ జీతాలు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపారని, ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఏమి తోచక ఈ రాష్ట్రంపై తెలంగాణ రాష్ట్రంలో కూర్చుని టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారని, వీరు చదువుకున్న ఐఏఎస్ చదువుపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏసీ గదులు వీడి ప్రజా సమస్యలపై రోడ్ల మీదకు వచ్చి పోరాడాలని లేనిపక్షంలో తిరుమల వెంకన్న వీరికి తగు రీతిలో శిక్ష విధిస్తాడు అని హెచ్చరించారు.వేంకటేశ్వర స్వామిని బ్రష్టు పట్టించేవాడు బ్రాహ్మణుడు అయినా సరే కచ్చితంగా స్వామివారు శిక్షించి తీరుతారని హెచ్చరించారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా తొలిసారిగా లబ్ధి పొందిన 1 లక్షా 50 వేలమంది బ్రాహ్మణ కుటుంబాల ఆశీర్వవచనాలతో మే 23న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి రాజా, యండపల్లి శబరి, పోచిరాజు పూర్ణచంద్రరావు, వంగవేటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

శిరిపురప శ్రీధర్ శర్మ……, రాష్ట్ర కో-కన్వీనర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here