కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

26

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు.

◆’104′ వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

◆90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం ఆదేశించారు.

◆’104′ వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణ సేకరించాలని తెలిపారు.

◆షుగర్‌, బీపీ లాంటీ వాటికి పరీక్షలు చేయడంతో పాటు అక్కడే మందులివ్వాలని సూచించారు.

◆అవసరమనుకున్న వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేయాలన్నారు.

‘104’ సిబ్బందితో పాటు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రతినెలలో ఒక రోజు తప్పనిసరిగా ఒక గ్రామానికి ‘104’ వాహనం వెళ్లాలన్నారు.

◆ప్రస్తుతం చేస్తున్న కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని సీఎం పేర్కొన్నారు.

నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలి..

◆”కంటైన్‌మెంట్‌ జోన్లలో 50 శాతం, మిగతా చోట్ల 50 శాతం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి.

◆కొన్ని పరీక్షలు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకునేవారికి కేటాయించాలి. ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి వారికి కోవిడ్‌ పరీక్షలు చేయాలి.

◆అలాగే వైరస్‌ వ్యాపించడానికి అవకాశం ఉన్న ఇతర రంగాల్లో పరీక్షలు చేయాలని” సీఎం జగన్‌ ఆదేశించారు.

ఒక వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానం రాగానే, ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలన్నారు.

◆లోకల్‌ ప్రోటోకాల్‌ ను రూపొందించి, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ఎస్‌వోపీని ఆ ఇంటికి తెలియజేయాలన్నారు.

◆అలాగే టెలిఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వాలని సీఎం సూచించారు.

ప్రతి ఇంటికి అవగాహన కల్పించాలి..

◆’రాబోయే 90 రోజుల్లో ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ప్రతి పీహెచ్‌సీలో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలి.

◆కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక హోర్డింగ్‌ పెట్టి అందులో వివరాలు ఉంచాలి. అందులో ఫోన్‌ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న కనీస వివరాలు ఉంచాలి.

◆సబ్‌ సెంటర్లు వచ్చిన తర్వాత ప్రతి గ్రామస్థాయిలోకూడా వైద్య సేవలు అందుతాయి.

◆పట్టణ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ప్లాన్‌ చేయాలి.

◆అర్బన్‌ ప్రాంతాల్లో కోవిడ్‌ నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేయాలి. అర్బన్‌ ప్రాంతాల జనాభా ప్రాతిపదికన, అవసరమైన ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని” సీఎం పేర్కొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌పై సీఎం ఆరా..

◆వర్షా కాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయని, సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

◆వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌పై సీఎం ఆరా తీశారు.

◆కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన, ప్రచారాన్ని బాగా పెంచాలన్నారు.

◆ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రిపోర్టు చేసేలా ఉండాలని, వీటికి సమీప ప్రాంతాల్లో టెస్టింగ్‌ సదుపాయం, మెడికేషన్‌ అందుబాటులో ఉంచాలన్నారు.

◆శానిటేషన్‌పైన కూడా దృష్టి పెట్టి, ప్రజలకు అవగాహన కలిగించేలా హోర్డింగ్స్‌ పెట్టాలని తెలిపారు.

◆1.42 కోట్ల ఆరోగ్య కార్డుల్లో 1.20 కోట్ల పంపిణీ పూర్తి అయ్యాయని, మిగతా పంపిణీ కూడా పూర్తి చేయాలన్నారు.

అనంతరం ప్రతి మనిషి ఆరోగ్య వివరాలను ఆరోగ్య కార్డులో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.

◆104, 108 కొత్త వాహనాలు జులై 1కి ప్రారంభమవుతాయన్నారు.

◆ఆరోగ్యశ్రీ కిందకు కోవిడ్‌ను తొలిసారిగా తీసుకువచ్చింది మనమేనని తెలిపారు.

మనుషులకైనా, పశువులకైనా, ఆక్వారంగంలో వినియోగించే ఔషధాలకైనా డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here