కరోనా డ్రగ్స్…ఫార్మా కంపెనీల అసలు దందా!!

228

వైద్యరంగంలో, ప్రత్యేకించి ఫార్మారంగంలో రోగుల భయాన్ని, నిస్సహాయతను సొమ్ము చేసుకోవడమే ఎక్కువ… అదొక పెద్ద మాఫియా… దాని గురించి లోతుల్లోకి వెళ్లడం లేదు మనమిప్పుడు… కానీ కరోనా వాక్సిన్, డ్రగ్‌పై పరిశోధనలు ఉధృతంగా సాగుతున్నయ్… ఏ కంపెనీ అయితే వాక్సిన్ గానీ, విరుగుడు మందు గానీ కనిపెడుతుందో ఇక దానికి అంతులేని ఖజానా దొరికినట్టే… అనేక దేశాల్లోని అనేక ఫార్మా కంపెనీలు సిన్సియర్ రీసెర్చ్‌లో మునిగిపోయినయ్.

అయితే మరి మన కంపెనీలు ఏం చేస్తున్నయ్…?
రీసెర్చ్ లేదు, ఏమీ లేదు… ఆల్రెడీ మార్కెట్లో ఉన్న యాంటీ వైరల్ మందులనే కరోనా పేరిట భారీగా సొమ్ము చేసుకునే పనిలో పడ్డయ్… ఎప్పుడైతే గ్లెన్‌మార్క్ కంపెనీ తన ఫావిపిరవిర్ మాత్రల్ని మార్కెట్లోకి వదిలిందో… మిగతా కంపెనీలు ఉలిక్కిపడ్డయ్.
గ్లెన్‌మార్క్ భారీ లాభాలను ఆశిస్తోంది… 14 రోజుల కోర్స్‌కు సరిపడా మాత్రలకు దాదాపు 14 వేల ఖర్చు… ఒక్కో మాత్రకు 103 రూపాయలు… ఖనిజపర్వతాన్ని తవ్వుకోవడం… అసలు దేశంలో అది ప్రయోగాలు చేసిందే 150 మందిపై… ఆ ప్రయోగఫలితాలనే సరిగ్గా రికార్డ్ చేయలేదు… డ్రగ్ కంట్రోల్ అథారిటీ హడావుడిగా అర్జెంటు నీడ్ పేరిట అనుమతులు ఇచ్చేసింది… అది కేవలం స్వల్ప, మధ్యస్థ లక్షణాలకు మాత్రమే పనిచేస్తుంది.

మరి దేశంలో రోజూ కొన్ని వేల మంది కరోనా నుంచి బయటపడుతున్నారు కదా… ఏం మందులు వాడుతున్నారు వాళ్లకు… సింపుల్, జ్వరానికి పారసెటమాల్, జలుబుకు సిట్రజిన్, లేకపోతే హైడ్రాక్సీక్లోరోక్విన్… అంతేకాదు, కొందరు యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ కలిపి వాడుతున్నారు… కొందరు డాక్టర్లు హెచ్ఐవీకి వాడే యాంటీ వైరల్ డ్రగ్స్… కేరళలో డాక్టర్లు నిపా వైరస్ వ్యాప్తి సమయంలో వాడిన యాంటీ వైరల్ డ్రగ్స్ కూడా రోగులకు ఇస్తున్నారు… వ్యాధి తీవ్రత, లక్షణాలను బట్టి డాక్టర్లు తమ విచక్షణతో రకరకాల యాంటీ వైరల్ డ్రగ్స్ వాడుతున్నారు.

మరి ఈ కొత్త మందుల కథేమిటి..?
ఇవేమీ వీళ్లు కనిపెట్టినవి కావు… ప్రయోగాలు చేసి ధ్రువీకరించుకున్నవీ కావు.
జెనెరిక్ డ్రగ్స్… అంటే ఆల్రెడీ మార్కెట్‌ను సొమ్ముచేసుకున్నవే… ఇప్పుడు ఎవరైనా తయారీ చేసుకోవచ్చు… ఫావిపిరవిర్ మాత్రల్ని ఎప్పుడో జపాన్ తయారుచేసింది… ఇన్ఫ్లుయెంజా డ్రగ్ అది… దాన్ని ఫాబిఫ్లూ పేరిట గ్లెన్‌మార్క్ మార్కెట్లోకి తీసుకొస్తోంది.ఇప్పుడు తాజాగా హెటిరో, సిప్లా వాళ్లు హడావుడిగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెండెసివర్ కూడా పాతదే… మనవాళ్లు కనిపెట్టిందేమీ లేదు… ఆల్రెడీ మార్కెట్లో ఉన్నదే… అమెరికా కనిపెట్టిన డ్రగ్ ఇది… గిలియాడ్ కంపెనీ రీసెర్చ్ ఇది… దీన్ని కరోనాపై కూడా వాడవచ్చునా లేదా అనే ప్రయోగాలు సాగుతున్నయ్… ఈలోపే మనవాళ్లు వాణిజ్య వాడకానికి అనుమతులిచ్చేశారు
నిజానికి ఇది అత్యవసర స్థితిలో, అనగా విషమ స్థితిలో మాత్రమే వాడదగిన మందు…* *బెడిసికొట్టే ప్రమాదాలూ ఉన్నాయంటారు.

ఇదే గిలియాడ్ ఇంకా BDR Pharmaceuticals, Jubilant Life Sciences, Mylan Laboratories, Dr Reddys Laboratories కు కూడా అనుమతి ఇచ్చేసింది… వాళ్లకూ పర్మిషన్లు రావల్సి ఉంది మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి… అసలు పెద్ద పెద్ద ఫార్మా దందాలకు డ్రగ్ కంట్రోల్ అథారిటీయే అడ్డా… కరోనాకు విరుగుడు మందులొచ్చేశాయ్ అనే ఓ కృత్రిమ హైప్ క్రియేట్ చేస్తున్నది ఫార్మా మాఫియా… ప్రస్తుత కరోనా భయాల నుంచి, అధిక ధరలతో వీలైనంత పిండుకోవడమే లక్ష్యం… హెటిరో కోవిఫర్ పేరిట అమ్మబోయే ఒక ఇంజక్షన్ ధర 5 నుంచి 6 వేల ఉండబోతున్నదట… అది ఎన్నిరోజులు వాడాలో ఇంకా తెలియదు… మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా అత్యవసరం పేరిట ఇక ఎడాపెడా అనుమతులిచ్చేస్తోంది… అసలు కరోనా రోగులపై ఈ మందుల ఫలితాల్ని మన ప్రభుత్వం శాస్త్రీయంగా, ఖచ్చితంగా నిర్ధారించుకున్నదా..?

ఈ సంక్లిష్టమైన పెద్ద ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానాలు కష్టం.

సేకరణ ఫేసుబుక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here