కరోనా’ కు ప్రముఖ సంగీత దర్శకుడు బలి!!

298

బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ (42) ముంబయిలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఆయా వర్గాలను కలవరపెడుతోంది. వరుస మరణాలతో సినీ పరిశ్రమను విషాద ఛాయలు వెంటాడుతున్నాయి. మే 31వ తేదీ (ఆదివారం) రాత్రి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) కన్నుమూశారు. కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే కరోనా కూడా సోకడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పలు హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చిన బాలీవుడ్ ఫేమ‌స్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్లలో ఒకరైన వాజిద్ ఖాన్ మరణం బాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు నింపింది. సాజిద్- వాజిద్ ఖాన్ ద్వయం ఎక్కువుగా సల్మాన్ ఖాన్ సినిమాలకు సంగీతం సమకూర్చారు. సల్మాన్ బ్లాక్ బస్టర్ సినిమాలైన ”వాంటెడ్, దబాంగ్, ఏక్తా టైగర్” తదితర చిత్రాలకు ఈ ద్వయమే బాణీలు కట్టింది. వాజిద్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. వాజిద్ మరణవార్త తమను షాక్‌కి గురిచేసిందని ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు పేర్కొంటున్నారు. వాజిద్ మృతి పట్ల రియాక్ట్ అయిన ప్రియాంకచోప్రా.. ”వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా” అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ ప్రగాడ సంతాపం తెలిపాడు.కేపి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here