కరోనా ఇప్పట్లో పోదు..మరింతమందికి సోకుతుంది!

16

కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ అంచనా వేశారు. వైరస్‌ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు ఉన్న ఈ బృందం కరోనాపై సమీక్ష జరపడం ఇది నాలుగోసారి. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులు చేసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేసింది. ఇంకా చాలా మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉందని.. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందన్నారు.
తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లో మరోసారి విజృంభిస్తోందని అధానోమ్‌ గుర్తుచేశారు. తొలినాళ్లలో పెద్దగా ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కొన్ని దేశాలు మాత్రం వైరస్‌ను బాగా కట్టడి చేయగలిగాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here