కట్టడి చేయకపోతే లక్షల సంఖ్యలో మరణాలు

56

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న కొవిడ్‌-19ను అలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటిన ప్రాంతాల్లో దాదాపు లక్షల సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కేవలం సంఘీభావం తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని వివిధ దేశాలు కలిసి ముందుకు సాగాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 10వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌తో విశ్వవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. దీని నుంచి తక్షణమే బయటపడాలంటే ప్రపంచదేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రతిదేశం వ్యూహాత్మక చర్యలు చేపడుతూనే..ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగాలేని దేశాలను కూడా ఆదుకోవాలని అభిప్రాయపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here