ఓటు లేనివాళ్ళంతా జగన్ ను నిలదీయండి;సీఎం చంద్రబాబు

46

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు కుట్రలో ఏ1 నిందితుడు వైకాపా అధ్యక్షుడు జగనేనని.. ఫారం-7 దుర్వినియోగం ఆ పార్టీకి సిగ్గుచేటని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా తెదేపా నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఫారం 7 దరఖాస్తులు 13 లక్షలు పంపుతారా అని వైకాపాను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. బెంగళూరు,హైదరాబాద్ నుంచే ఈ కుట్రలు సాగాయని ఆరోపించారు. ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. 2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీయిజం లేకుండా చేశామని చంద్రబాబు చెప్పారు. తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్‌కు అలవాటుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తప్పులు చేసేవాళ్లు, నేరగాళ్లకే వైకాపాలో చోటు దక్కుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here