ఓటుకు నోటు…ఎవరికి చేటు?

75

ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఇప్పటిదాకా ఉన్న అంచనాల ప్రకారం మహిళల ఓట్లు, జనసేన చీలిక ఓట్లు విజేతను నిర్ణయించవచ్చనే అభిప్రాయం ఉంది. కానీ పల్లెల్లోకి వెళితే తేలిన కొత్త అంశం కూడా ఒకటి ఉంది. ముఖ్యంగా ఇరు ప్రధాన పార్టీలు భారీగా డబ్బులు పంపిణీ చేశాయి. ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకున్న వాళ్లు సమన్యాయం చేయడానికే పూనుకున్నారు. ఉన్న రెండు ఓట్లలో ఒక ఓటును తెలుగుదేశానికి, ఇంకో ఓటును వైసీపీకీ వేశారు. నేను చాలా మందిని అడిగితే వచ్చిన సమాధానమిది. దీన్ని బట్టి క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. ఇందులో ప్రధానమైన అంశం ఏమిటంటే పల్లెటూళ్లో చాలామందికి ఏది అసెంబ్లీ ఓటో, ఏది పార్లమెంటు ఓటో తెలియకపోవడం. ఇరుపక్షాలు నోట్లు పంపిణీ చేయకపోతే ఓటర్ల తీర్పు స్పష్టంగా ఉండేది. ఈ క్రాస్ ఓటింగ్ వల్ల పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో కూడా తేడా కనిపించే అవకాశం లేకపోలేదు.

—–సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here