ఓటరు నమోదు ప్రక్రియలో విశేష కృషి;గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌

116

రాష్ట్రంలో నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియలో విశేషమైన కృషిని కనబరిచిన జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ స్థాయి అధికారులను, ఎన్నికల విధి విధానాలపై విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన పోటీల విజేతలను గవర్నర్ ఇ.యస్.ఎల్.నరహింహన్ అభినందించారు. శుక్రవారం విజ‌య‌వాడ‌లోని తుమ్మల్లపల్లి కళాక్షేత్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది ఓటర్లు నమోదు చేయడంలో భాగంగా ప్రతిభను చూపించిన అధికారులకు, సిబ్బందికి గవర్నర్ నరసింహన్ ధృవపత్రాలు, నగదు బహుమతులు, మేమోంటోలు అందజేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కృష్ణాజిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలను అవార్డు, ధృవపత్రాలతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. ఓటరు నమోదులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధికారులను సన్మానించారు. ఎలక్షన్ రిటర్నింగ్ అధికారుల విభాగంలో కావలి ఆర్డీఓ ఐ.భక్తవత్సల రెడ్డి, సత్యవేడు ఆర్టీఓ ఎస్. లక్ష్మీలను, ఆసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారుల విభాగంలో పెనుగొండ నియోజకవర్గం-ఆర్.ఎన్ హసీనా సుల్తాన్, హిందూపురం నియోజకవర్గం-పి.విశ్వనాధ్, బూత్ లెవల్ స్థాయి అధికారుల విభాగంలో నెల్లూరుకు చెందిన ఎన్.శశికళ, చిత్తూరుకు చెందిన శైలజలను కేంద్ర ఎన్నికల కార్యాలయ డిపిఓలు జె.సదాశివరావు, కె.నవీన్ వరప్రసాద్లు విధుల్లో వారు చూపిన పనితీరును ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలను అందించారు. వ్యాస రచన పోటీలలో సినీయర్ విభాగంలో మొదటి బహుమతి అనంతపురం జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజికి చెందిన బి.ఎ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.సాయిసుష్మా గెలుచుకున్నారు. రెండవ బహుమతి గుంటూరు జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ఫర్ ఉమెన్ బి.ఎ మొదటి సంవత్సరం చదువుతున్న సి.హెచ్.అన్నమ్మ గెలుచుకున్నారు. ఎస్ఐ రైటింగ్ పోటీలలో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి ప్రకాశం జిల్లా పరుచూరులో శారదా హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఎం.శీరీష గెలుచుకున్నారు. రెండవ బహుమతి కడప జిల్లాలో జెడ్పీహెచ్‌ఎస్ ఎర్రగుంట్లలో 9వ తరగతి చదువుతున్న యు.పూజిత గెలుచుకున్నారు. వకృత్వపు పోటీలలో సినీయర్ విభాగంలో మొదటి బహుమతి అనంతపురం జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజికి చెందిన బి.ఎ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.ఐషా సిద్దిక్, రెండో బహుమతి శ్రీకాకుళం జిల్లా నర్సన పేటలో ఎల్.వి.ఆర్ డిగ్రీ కాలేజిలో బి.ఎస్.సి రెండవ సంవత్సరం చదువుతున్న కె.కుసుమ పావని గెలుచుకున్నారు. ఎలోకేషన్ పోటీలలో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి అనంతపురం జిల్లా హిందుపూర్ ఈ.ఎం.హెచ్.ఎస్ మేలాపూరిలో 9వ తరగతి చదువుతున్న ఎన్.రుచిత, రెండో బహుమతి శ్రీకాకుళం జిల్లా నర్సన పేటలో సంపత్ సాయి జూనియర్ కాలేజిలో కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న యు.చాందిని గెలుచుకున్నారు. మెమోంటోలను, ప్రశంసాపత్రాలతో పాటు డిఇఓలకు రూ.25 వేలు, ఇఆర్ఓలకు రూ.20 వేలు, బిఎల్ఓలకు, డిపిఓలకు రూ.10 వేలు, విద్యార్థిని, విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లు, ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here