ఏప్రిల్‌ 6న డయల్‌ యువర్‌ టిటిడి ఈవో

4

తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఏప్రిల్‌ 6వ తేదీన జరుగనుంది. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు. 0877-2263261.

కాగా, జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని కోరడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here