అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని మరోసారి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాజధాని పోరాటానికి నేటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రైతులు, జేఏసీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతుల పోరాటానికి మద్దతుగా సుజనా ట్వీట్ చేశారు. ‘‘నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.’’ అని సుజనా ట్వీట్ చేశారు.