ఏపీ బిసి యువ‌గ‌ర్జ‌న‌ను విజ‌య‌వంతం చేయండి: మంత్రి కొల్లు ర‌వీంద్ర

బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్‌లు, కేంద్రంలో ప్రత్యేక బిసి మంత్విత్వ శాఖ ఏర్పాటు, బీసీ కమిషన్ చట్టభద్రత త‌దిత‌ర అంశాల‌కు సంబంధించిన డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీసీ యువ‌జ‌న సంఘం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 10న (శ‌నివారం) విజ‌య‌వాడ‌ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ బిసి యువగర్జన కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి కొల్లు ర‌వీంద్ర అన్నారు. బీసీ యువ‌జ‌న సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం విజ‌య‌వాడ ల‌బ్బీపేట‌లోని మంత్రి కొల్లు ర‌వీంద్ర విడిది కార్యాల‌యంలో మంత్రి చేతుల‌మీదుగా బీసీ యువ‌గర్జన గోడ‌ప‌త్రిక‌ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా క‌ర్రి వేణుమాధ‌వ్ మాట్లాడుతూ బీసీ యువ‌గ‌ర్జ‌నకు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ విద్యార్థి విభాగం కో-ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు కింజ‌ర‌పు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పలువురు ప్రజాప్రతినిధులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. గోడ‌ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ‌లో రాష్ట్ర బిసి కార్మిక విభాగం అధ్యక్షుడు బండారు రాజేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడు బోను శివ, తెనాలి బిసి యవజన సంఘం అధ్యక్షుడు కాకుమాను నరేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కె.చైతన్య యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిలి రామ్‌సింగ్, బీసీ సంఘాల నాయ‌కులు శ్రీకాంత్ గౌడ్, మునగాల కామేశ్వరరావు, డి.ఎస్.ప్రకాష్, జోగి మధుబాబు, పిల్లా దినేష్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *